దర్శకుడు క్రిష్ మొదట్నించీ విభిన్నంగా ఆలోచిస్తూ, వైవిధ్యమైన సినిమాలు అందిస్తూ వచ్చారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను రీజనబుల్ బడ్జెట్ తో, అతి తక్కువ టైమ్ లో తీసి చూపించిన ఘనత కూడా ఆయనదే. ఎన్టీఆర్ బయోపిక్ ను టేకప్ చేసి, దాని దశ, దిశనే మార్చేసారు క్రిష్.
ఒక పక్క డైరక్షన్ చేస్తూనే టీవీ సీరియళ్లు, చిన్న సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఆయన మిత్రులు రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ ఈ విషయంలో ఆయనతో ప్రయాణిస్తున్నారు. లేటెస్ట్ గా దర్శకుడు క్రిష్ మరో చెప్పుకోదగ్గ, నలుగురు చెప్పుకునే ప్రయత్నం ఒకటి తలకెత్తుకోబోతున్నారు. అయితే ఈసారి తెలుగులో కాదు. తమిళంలో.
తమిళంలో రాజ రాజ చోళుడు గాధను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని కేవలం రెండున్నర గంటల సినిమాగా కాకుండా, ఆరు భాగాల వెబ్ సిరీస్ గా చేయాలని క్రిష్ ప్లాన్ చేసారు. అందువల్ల ఓ చక్రవర్తి కథను డిటైల్డ్ గీ డీల్ చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ఆరు భాగాల వెబ్ సిరీస్ కు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.
క్రిష్ సూపర్ విజన్ లో ఈ సిరీస్ ను సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ హ్యాండిల్ చేయబోతున్నారు. ప్రేమ, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాలను సురేష్ కృష్ణ తెలుగులో అందించారు. రాజ రాజ చోళుడు తమిళంలో తయారైనా, తెలుగులోకి అనువాదం అయ్యే అవకాశం వుంది. ఇదిలావుంటే ఇదే సబ్జెక్ట్ తో దర్శకుడు మణిరత్నం తమిళంలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తుండడం విశేషం.
డైరెక్టర్ హీరోను ఇంటర్వ్యూ చేస్తే… అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్