ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవల. మూడు భాగాల్లో వచ్చిన ఈ నవల తెలుగులోకి కూడా అనువాదమైంది. మృత్యుంజయులు, నాగా రహస్యం, వాయుపుత్ర శపథం పేర్లతో తెలుగులో కూడా వచ్చింది.
ఇప్పుడీ మెగా నవలపై సూపర్ హిట్ డైరైక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కన్నేశాడు. అమిష్ త్రిపాఠి రచించిన ఈ నవల రైట్స్ ను భన్సాలీ దక్కించుకున్నట్టు టాక్.
మొన్నటివరకు ఈ నవల హక్కులు కరణ్ జోహార్ వద్ద ఉండేవి. ఈ నవల ఆధారంగానే శుద్ధి అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు కరణ్ జోహార్. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ హక్కులకు సంబంధించిన కాలపరిమితి పూర్తయినట్టు తెలుస్తోంది.
మరోవైపు శుద్ధి ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు కరణ్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలాంటి టైమ్ లో సీన్ లోకి భన్సాలీ ఎంటర్ అయ్యాడు.
రచయితతో చర్చలు జరిపి ఆ రైట్స్ ను భన్సాలీ దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఫాంటసీ, హిస్టారికల్ కథల్ని తెరకెక్కించడంలో భన్సాలీ దిట్ట. మెలూహ లాంటి నవల ఇలాంటి దర్శకుడి చేతిలో పడితే అది కచ్చితంగా విజువల్ వండర్ గా మారుతుంది.