సినిమాల్లోకి మరో ‘బాబు’

సినిమా జనాల పిల్లలు, రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి రావడం కామన్. అప్పుడప్పుడు బిజినెస్ జనాల పిల్లలు కూడా సినిమాల్లోకి రావాలని ముచ్చట పడుతుంటారు. సచిన్ జోషి ఇలా బిజినెస్ ఫీల్డ్ నుంచి వచ్చిన…

సినిమా జనాల పిల్లలు, రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి రావడం కామన్. అప్పుడప్పుడు బిజినెస్ జనాల పిల్లలు కూడా సినిమాల్లోకి రావాలని ముచ్చట పడుతుంటారు. సచిన్ జోషి ఇలా బిజినెస్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడే. కోనేరు హవీష్ విద్యాసంస్థల నుంచి వచ్చాడు. అలాగే ఆ మధ్య గోఠీ సంస్థల నుంచి ఓ కుర్రాడు ట్రయ్ చేసాడు.

ఇప్పుడు ఆంధ్రలో పాపులర్ అయిన స్వీట్ మ్యాజిక్ బ్రాండ్ వారసుడు కూడా సినిమాల్లోకి వస్తున్నాడట. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్వీట్ మ్యాజిక్ అన్నది పాపులర్ బ్రాండ్. ఈ చైన్ దుకాణాలకు చెందిన రక్షిత్ కూడా హీరోగా ట్రయ్ చేస్తున్నాడు. వచ్చే నెలలో విడుదల కాబోతున్నలండన్ బాబులు సినిమాలో ఈ కుర్రాడు హీరో. ఇతని సరసన హీరోయిన్ స్వాతి నటిస్తోంది.

ఒక్కప్పుడు వీడు తేడా అనే సినిమాను అందించిన రైటర్ చిన్ని కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇదే సినిమాలో కమెడియన్ సత్య ఫుల్ లెంగ్త్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఒక పక్క తన డైరక్షన్ తాను చేసుకుంటూ, చిన్న సినిమాలు నిర్మిస్తున్న మారుతి ఈ చిత్రానికి నిర్మాత.