మంజిమా మోహన్ గుర్తుందా..? నాగచైతన్యతో “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా చేసింది. ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగుతెరపైకి రాలేదు ఈ మలయాళీ బ్యూటీ. ప్రస్తుతం 2 తమిళ సినిమాలతో బిజీగా ఉన్న మంజిమా.. సోషల్ మీడియాలో మాత్రం వెరీ యాక్టివ్. తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. ఇందులో భాగంగా హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ పై కామెంట్స్ చేసిన ఓ వ్యక్తికి ఓపెన్ గానే క్లాస్ తీసుకుంది.
ఏదో చర్చలో భాగంగా హీరోయిన్లను న్యూడ్ గా చూడ్డానికే ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారంటూ కామెంట్ చేశాడు ఓ వ్యక్తి. ఈ కామెంట్ చూసి మంజిమాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సదరు అభిమాని కామెంట్ ను తప్పుబట్టిన మంజిమా మోహన్.. కేవలం హీరోయిన్లను నగ్నంగా చూడ్డానికే ప్రేక్షకులు థియేటర్లకు రారని, మంచి కథ ఉంటే ఆటోమేటిగ్గా సినిమా చూస్తారని పోస్ట్ చేసింది.
కేవలం హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ పై, వాళ్లు వేసుకున్న చిన్నచిన్న దుస్తులు చూసి సినిమాలు ఆడవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంజిమా మోహన్ కాస్త గట్టిగానే క్లాస్ పీకింది. మంజిమా అభిప్రాయానికి సోషల్ మీడియాలో 50-50 రెస్పాన్స్ వచ్చింది. “అవును.. కేవలం సినిమా బాగుంటేనే చూస్తాం” అని కొందరు కామెంట్ చేస్తే.. సినిమాతో పాటు తమకు హీరోయిన్ అందాలు కూడా కావాలని మరో సగం మంది అభిప్రాయపడ్డారు. దీంతో ఆ డిస్కషన్ ను అక్కడితో ఆపేసింది మంజిమ.