హీరోయిన్ కు ఇన్ స్టాగ్రమ్ లో పంచ్ ఇచ్చిన కూతురు!

కొందరు పిల్లలంతే.. అది తల్లిదండ్రులైన ‘అతి’ చేస్తుంటే తట్టుకోలేరు. ‘ఎందుకు ఇలా..’ అంటూ అప్పటికప్పుడు, అక్కడికక్కడ నిలదీసేస్తారు. ఇప్పుడు కాజోల్ కు కూడా అదే అనుభవంలోకి వచ్చింది. తల్లి కొంచెం గారాలు పోవడంతో.. కాజోల్…

కొందరు పిల్లలంతే.. అది తల్లిదండ్రులైన ‘అతి’ చేస్తుంటే తట్టుకోలేరు. ‘ఎందుకు ఇలా..’ అంటూ అప్పటికప్పుడు, అక్కడికక్కడ నిలదీసేస్తారు. ఇప్పుడు కాజోల్ కు కూడా అదే అనుభవంలోకి వచ్చింది. తల్లి కొంచెం గారాలు పోవడంతో.. కాజోల్ కూతురు సోషల్ మీడియా ముఖంగానే పంచ్ ఇచ్చింది! 

ఇంతకీ జరిగిందేమిటంటే.. ఇన్ స్టాగ్రమ్ లో భిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో పోజులు పోస్టు చేసిన కాజోల్ దానికి ఒక క్యాప్షన్ ను యాడ్ చేసింది. తన పిల్లలు- భర్త కలిసి సరదాగా ఉన్నప్పుడు వారిని చూస్తూ.. తన ఎక్స్ ప్రెషన్లు అలా ఉంటాయని కాజోల్ మురిపెంగా చెప్పుకొచ్చింది. అయితే మురిపెం కాజోల్ కూతురుకు అంత నచ్చినట్టుగా లేదు.. ‘ఎందుకమ్మా.. ఇంత ఎక్స్ ట్రా’  అంటూ ఆ అమ్మాయి కామెంట్ పెట్టేసింది!

అభిమానాలను, ఆత్మీయతను ఎగ్జాజరేట్ చేసి.. ఇలా సోషల్ మీడియాకు ఎక్కించడం ఎందుకు? అనే ప్రశ్న ధ్వనిస్తోంది కాజోల్ కూతురు ప్రశ్నలో! కాజోల్ కు ఇన్ స్టాగ్రమ్ లో అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చింది కూడా కూతురేనట. ఆ అమ్మాయే తల్లికి ఈ పంచ్ ఇచ్చింది.