సమంత ‘ముదురు’ అని అడుగుతున్నారా?

ఎవరన్నా అందంగా వుందని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటారు.. లేదా క్యూట్ గా వుందని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటారు. కానీ రామ్ చరణ్ పక్కన సమంతను కాస్త ముదురుగా వుంటుందని తీసుకోవాలనుకుంటున్నారట. అదేంటీ అంటే..ఈ సినిమా…

ఎవరన్నా అందంగా వుందని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటారు.. లేదా క్యూట్ గా వుందని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటారు. కానీ రామ్ చరణ్ పక్కన సమంతను కాస్త ముదురుగా వుంటుందని తీసుకోవాలనుకుంటున్నారట. అదేంటీ అంటే..ఈ సినిమా క్యారెక్టర్ ప్రకారం హీరో రామ్ చరణ్ కాస్త రగ్గ్ డ్ లుక్ తో వుంటాడట. 

అతని పక్కన క్యూట్ గా అనుపమ, రకుల్ లా వుండేవాళ్లు కాక, కాస్త వయసు ముదిరిన హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. అందుకే ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్ సమంతనే కనిపిస్తోందట. అవును మరి సమంత ఇప్పుడు థర్టీ ఇయర్స్ కు దగ్గరైపోయింది కదా? అందువల్ల కాస్త ముదురుగానే కనిపిస్తుందేమో? 

అయితే సమంత కూడా మరీ ఖాళీగా లేదట. తమిళ్ లో విశాల్ పక్కన, శివ కార్తకేయన్ పక్కన రెండు సినిమాలు ఓకె చేసిందట. ఇక్కడ రాజుగారి గదిలో చేసే అవకాశం వుంది. మరి మధ్యలో తన ఎంగేజ్ మెంట్, అఖిల్ పెళ్లి వున్నాయి. ఇవన్నీ చూసుకుని డేట్ లు ఇస్తే, సుకుమార్ కు కావాల్సిన 'ముదురు హీరోయిన్' దొరికినట్లే. లేదంటే వేట మళ్లీ మొదటికి వస్తుంది.