ఇలాంటి వాళ్ల శృంగార జీవితం అద్భుతం!

జీవితంలో చక్కటి శృంగారాన్ని ఆస్వాధించడం పై శారీరక, మానసిక తీరు కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు సెక్స్ థెరఫిస్టులు. బిజీ లైఫ్, యాంత్రికమైన జీవితం, కెరీర్ టెన్షన్లు.. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా మనస్తత్వం,…

జీవితంలో చక్కటి శృంగారాన్ని ఆస్వాధించడం పై శారీరక, మానసిక తీరు కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు సెక్స్ థెరఫిస్టులు. బిజీ లైఫ్, యాంత్రికమైన జీవితం, కెరీర్ టెన్షన్లు.. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా మనస్తత్వం, శారీరక అలవాట్లు.. సహజంగానే మంచి శృంగార జీవితానికి బాటలు వేస్తాయని వీరు శాస్త్రీయ పరిశోధనల ద్వారా చెబుతున్నారు.

ఈజీ గోయింగ్.. ఈ తరహా మనస్తత్వం ఉన్న వాళ్ల శృంగార జీవితం అద్భుతంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎదుటి వాళ్ల ఆనందంలోనే తమ ఆనందాన్ని చూసుకునే వాళ్లు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమ్మతమైన వైఖరిని వ్యక్తం చేసే వాళ్లు ఈ ఈజీగోయింగ్ పర్సన్స్ కింద వస్తారట. వీళ్ల శ శృంగార జీవితం సహజంగానే చాలా ఆనందకరంగా ఉంటుందట.

సుఖంగా నిద్రపోయే వాళ్లు..  ఎక్స్ ట్రా స్లీపింగ్ అవర్స్ ను కలిగి ఉన్న వారిలో శృంగారాస్వాధనపై అమితాసక్తి ఉంటుందని మరో పరిశోధన తెలుపుతోంది. కాసేపు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని, అధికంగా విడుదలయ్యే ఆక్సిటోసిన్ శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు తెలిపారు.

మానసికంగా దగ్గరగా ఉండే వాళ్లు.. పార్ట్ నర్ తో కేవలం శారీరక సంబంధాన్నే గాక మానసికమైన బంధాన్ని కలిగి ఉండటం శృంగారస్వాధనకు అత్యంత కీలకమైనదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం ఎవరో చెప్పాల్సింది కాకపోయినా.. దీనిపై శాస్త్రీయ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ శృంగార జీవితం ఆనందకరంగా ఉందని  చెప్పిన ప్రతి వంద మంది మేల్/ ఫిమేల్ లో  75 శాతం మంది సెక్స్వల్ ఎన్ కౌంటర్ లో తమ పార్ట్నర్ 'ఐ లవ్ యూ' చెప్పినట్టుగా తెలిపారు. 

బెడ్ మీద వరకూ వచ్చాకా కూడా ఐ లవ్యూ చెప్పడం మానసికంగా వారి దగ్గరి తనాన్ని తెలియ జేస్తోంది. ఇలాంటి వారి పార్ట్నర్ శృంగార జీవితం ఆనందకరంగా ఉండటం, మానసిక బంధం శారీరక సంతోషాన్ని కలిగిస్తుందనడానికి రుజువని పరిశోధకులు చెబుతున్నారు.

వాళ్లు ప్రయోగాలు చేస్తారు.. అవును, ఏ కామసూత్రాలనో ప్రయోగాత్మకంగా అనుసరించేవాళ్లు గొప్ప శృంగార జీవితాన్ని ఆస్వాధిస్తున్నట్లేనట! శారీరక వ్యాయామం కూడా.. ప్రత్యేకించి మగాడి సెక్స్వల్ డిజైర్స్ ను శారీరక వ్యాయామం ప్రభావితం చేస్తుందని, రెగ్యులర్ గా కనీసం జాగింగ్ చేయడం కూడా సెక్సువల్ హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తుందని, దీని ఫలితాలు బెడ్రూమ్ లో ఉంటాయని పరిశోధకులు అంటున్నారు!