ఐటమ్ సాంగ్ లేని సినిమా, ఉప్పులేని పప్పు అయిపోయింది ఇటీవల కాలంలో. పెద్ద హీరోయిన్లు చేస్తే స్పెషల్ సాంగ్, చిన్న హీరోయిన్లు చేస్తే అయిటమ్ సాంగ్. అంతే తేడా. ఎప్పుడో పూర్తయిపోయి, విడుదలకు సిద్దంగా వున్నా రాజ్ తరుణ్-దొంగాట వంశీకృష్ణ కాంబినేషన్ లోని కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త సినిమాకు కూడా ఇప్పుడు ఇలాంటి సాంగ్ ఒకటి జోడించాలని డిసైడ్ అయ్యారు.
ఈ స్పెషల్ సాంగ్ కు రేష్మి అయితే బాగుంటుదని ఆలోచిస్తున్నారు. ఆమె నో అంటే మరొకర్ని చూస్తారు. రేష్మి ఇటీవల కాలంలో అందాలు ఆరబోయడంలో ఎప్పటికప్పుడు మంచి మార్కుల సంపాదిస్తోంది. అందువల్ల ఆమెతో ఓ స్పెషల్ సాంగ్ ను పిక్చరైజ్ చేసి, సినిమాకు జోడించి, అదనపు ఆకర్షణ తేవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.