ప్రభాస్ కే ఎందుకిలా?

ప్రభాస్ జాతకం ఏమిటో కానీ.. అనుకున్న సినిమా ఏదీ సజావుగా సాగదు. కిందా మీదా పడితే తప్ప విడుదల కాదు. ప్రామిసింగ్ సినిమా అనుకుంటే అది విడుదల టైమ్ కు విడుదలైతే చాలు అనేలా…

ప్రభాస్ జాతకం ఏమిటో కానీ.. అనుకున్న సినిమా ఏదీ సజావుగా సాగదు. కిందా మీదా పడితే తప్ప విడుదల కాదు. ప్రామిసింగ్ సినిమా అనుకుంటే అది విడుదల టైమ్ కు విడుదలైతే చాలు అనేలా మారిపోతుంది. బాహుబలి సిరీస్ తరువాత నుంచి ఇప్పటి వరకు అన్నీ అదే పరిస్థితి. సాహో సినిమా మీద బోలెడు అంచనాలు వుండేవి. ఆఖరికి ఎలాగోలా విడుదలై, యావరేజ్ అనిపించుకుంది. 

రాధేశ్యామ్ సినిమా సరేసరి. ఇదిగో.. అదిగో అంటూ విడుదలై ఆఖరికి అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఆదిపురుష్ నిర్మాణంలో వుండగా సంచలనాలు. కానీ టీజర్ వచ్చేసరికి మొత్తం జారిపోయింది. దాంతో రిపేర్లు, మార్పులు చేర్పులు, ఆఖరికి విడుదలయ్యాక విమర్శలు. మొత్తం మీద ఆ సినిమా అలా జారిపోయింది. 

ఇక ఫ్యాన్స్ ఆశలు అన్నీ సలార్ సినిమా మీదే. కేజిఎఫ్ లాంటి సంచలన చిత్రం అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. మంచి బ్యానర్. అంతా బాగుంది అనుకుంటే అసలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఓ అప్ డేట్ వుండదు.ఆఖరికి ఆఖరి నిమిషంలో వాయిదా అంటూ డిసెంబర్ లో డేట్ ప్రకటించారు

ఇప్పటి వరకు టీజర్ తప్ప మరో కంటెంట్ ఇవ్వలేదు. ప్రభాస్ విదేశాల్లో వున్నారు. సలార్ మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. రెండు భాగాలు అని మొదట్లో వినిపించింది. కానీ యూనిట్ నుంచి క్లారిటీ ఇవ్వలేదు. ఆఖరికి ఇచ్చారు. కానీ ఇప్పుడు రెండు భాగాలు కాదు, ఒక భాగం అనే టాక్ వినిపిస్తోంది. సినిమా కంటెంట్ క్వాలిటీ మీద అనుమానాలు రావడంతో రెండో భాగంలోని కొన్ని సీన్లు తొలి భాగంలోకి తెచ్చారని అందువల్లే విడుదల ఆలస్యమయిందని టాక్ వినిపిస్తోంది.

సినిమాలో వాస్తవానికి ఒకటే పాట అని, అది అమ్మ మీద పాట అని వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఓ ఐటమ్ సాంగ్ ను యాడ్ చేసారని తెలుస్తోంది. ఈ మధ్య పది రోజులు షూట్ మళ్లీ చేసారు అనగానే అనుమానాలు వినిపించడం ప్రారంభమైంది. సలార్ హిట్ అయితే ప్రభాస్ కు అన్ని విధాలా బాగుంటుంది.

లేదంటే కేవలం ప్రాజెక్ట్ కె మీదే భారం వేసుకుని వుండాలి.