ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా డ్యూయెట్. హైదరాబాద్ లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ “డ్యూయెట్”తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో “డ్యూయెట్” సినిమా ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, హీరో సత్య దేవ్ అతిథులుగా హాజరయ్యారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటి చేశారు. ఆనంద్ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – స్టూడియో గ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా తో కలిసి డ్యూయెట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు వెరైటీ లవ్ స్టోరీస్ తెరకెక్కుతున్నాయి. ఆ క్రమంలో డ్యూయెట్ కూడా ఒక వైవిధ్యమైన ప్రేమ కథ అవుతుంది. డైరెక్టర్ మిథున్ ఫెంటాస్టిక్ స్టోరీ రాశాడు అన్నారు.
దర్శకుడు మిథున్ వరదరాజ కృష్ణన్ మాట్లాడుతూ – డ్యూయెట్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇదొక మంచి లవ్ స్టోరి. మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – డ్యూయెట్ స్పెషల్ మూవీ. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, మధుర శ్రీధర్ లకు థ్యాంక్స్. మా టీమ్ అదరం కలిసి ఒక మంచి మూవీ చేయబోతున్నాం. అన్నారు.
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ – నేను సూర్య, కార్తీతో కోలీవుడ్ లో మూవీస్ చేసినట్లే.. ఇక్కడ విజయ్ తో నోటా సినిమా చేశాను, ఆనంద్ తో డ్యూయెట్ మూవీ నిర్మిస్తున్నాను. ఆనంద్ నాకు చాలాకాలంగా తెలుసు. దర్శకుడు మిథున్ ఈ కథ చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. డ్యూయెట్ సూపర్ హిట్ అవుతుందనే టీమ్ అంతా నమ్మకంగా ఉన్నాం. అన్నారు.