గబ్బర్ సింగ్ అనగానే సల్మాన్ ఖాన్ దబాంగ్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు మాతృక ఆ సినిమానే. సర్దార్ గబ్బర్ సింగ్ ను ఆరంభంలో గబ్బర్ సింగ్ 2 అనే వార్తలు వినవచ్చాయి. ఆఖరికి సర్దార్ గబ్బర్ సింగ్ అని టైటిల్ ఫిక్స్ చేసారు. సరే, సినిమా అయిపోయింది.. సెన్సారు జరిగిపోయింది.. విడుదలకు సన్నాహాలు జరిగిపోతున్నాయి.
అయితే దబాంగ్ నిర్మాతలు ఏదో అభ్యంతరం చెప్పారనో, చెబుతున్నారనో వదంతులు ఈ రోజు వినిపిస్తున్నాయి. తాము దబాంగ్ 2 తీసామని, ఇప్పుడు గబ్బర్ సింగ్ సీక్వెల్.. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ తీయడం వల్ల తమ దబాంగ్ 2 హక్కులకు ఎటువంటి ఎంక్వయిరీలు రాకపొవచ్చన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారని వదంతి వినిపిస్తోంది.
మరి ఇది ఏ మేరకు నిజమో, వ్యవహారం ఏ స్టేజ్ లో వుందో ఇంకా తెలియదు. శరద్ మురార్ దీన్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని వినికిడి.