జబర్దస్త్ … గబ్బర్ సింగ్

జబర్దస్త్ షో మస్త్ హిట్.. దాన్నిండా పరుచుకున్న బూతులే అందుకు పెద్ద మద్దతు. ఏమైతేనేం జబర్దస్త్ స్కిట్ లు టీవీ షోలను మార్చడం సంగతి అలా వుంచితే, బోలెడు మంది చోటా మోటా నటులకు…

జబర్దస్త్ షో మస్త్ హిట్.. దాన్నిండా పరుచుకున్న బూతులే అందుకు పెద్ద మద్దతు. ఏమైతేనేం జబర్దస్త్ స్కిట్ లు టీవీ షోలను మార్చడం సంగతి అలా వుంచితే, బోలెడు మంది చోటా మోటా నటులకు సినిమా జీవితాన్ని ప్రసాదించాయి. ఇంతకీ విషయం ఏమిటంటే..సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అచ్చం జబర్దస్త్ షో మాదరిగా వుంటుందని టాక్ వినిపిస్తోంది. 

సినిమాలో కథ సింపుల్ అని.. దుష్టుడు.. ఓ అమ్మాయి.. ఓ రక్షకుడు.. ఇంతే. అయితే సినిమా అంతా ఎక్కకిక్కడ ముక్కలు ముక్కలుగా జబర్దస్త్ షోల మాదరిగా చిన్న చిన్న సీన్లు వుంటాయట. అవి ఎక్కడిక్కడ నవ్వులు పండిస్తాయట. వీటి నడుమ కథ అలా అలా రన్ అవుతూ వుంటుందన్నమాట.

షోలే స్ఫూర్తి

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వెనుక షోలే సినిమా ప్రభావం భయంకరంగా వుందటున్నారు. కర్ణాటకలోని ఓ మారు మూల ప్రాంతాన్ని ఎంచుకుని రామ్ పూర్ అనే గ్రామాన్ని క్రియేట్ చేసారు షోలే కోసం. అక్కడ గబ్బర్ అనే దుష్టుడు జనాల్ని నానా బాధ పెడుతుంటాడు. సంజీవ్ కుమార్ అనే రిటైర్డ్ పోలీసు అధికారి అమితాబ్ ను, ధర్మేంద్రను అక్కడకు రప్పిస్తాడు.

అదే మాదిరిగా రతన్ పూర్ అనే గ్రామాన్ని సర్దార్ కోసం క్రియేట్ చేసారు. ముఖేష్ రుషి అనే కేర్ టేకర్ తన యువరాణి కోసం, ఆ దుష్టుడి అడ్డుకోవడం కోసం గబ్బర్ సింగ్ అనే పోలీస్ ను రప్పిస్తాడు. అయితే షో లేలో ధర్మేంద్ర క్యారెక్టరైజేషన్ కు ఈ గబ్బర్ సింగ్ క్యారేక్టర్ దగ్గరగా వుంటుందట. అల్లరి చిల్లరగా వుంటూనే ఎగ్రెసివ్ గా వుండడం అన్నమాట.

మొత్తం మీద సర్దార్ పవన్ పై షో లే ప్రభావం కాస్త ఎక్కువే వున్నట్లుంది.