ఎన్టీఆర్ కు బాబాయ్ బాలయ్యకు, లేదా ఎన్టీఆర్ కు మామయ్య చంద్రబాబుకు, ఇంకా కాదంటే, బావ లోకేష్ కు మధ్య ఎందుకు ప్యాచప్ కావడం లేదు. మొహాలు చూసుకోలేనంత, మన్నించలేనంత వైరం ఏమిటి? ఇంతకన్నా ఘోరంగా చంద్రబాబుతో విబేధించిన వారెందరో ఇప్పుడు తెలుగుదేశంలో వున్నారు. వైఎస్ వెంట వుండి పనులు చేయించుకున్న ఎందరో కాంట్రాక్టర్లు, బిజినెస్ పీపుల్ ఇప్పుడు బాబుతో సయోధ్యగా వున్నారు.
మరి ఒక్క ఎన్టీఆర్ విషయంలో ఎందుకు ఇది సాధ్యం కావడం లేదు. పోనీ ఎన్టీఆర్ కు కలవాలని లేదా? బాలయ్య వైపు నుంచి అభ్యంతరాలున్నాయా? ఎన్టీఆర్ కు కలవాలనే వుందన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. మరి అలాంటపుడు సమస్య ఎవరితో? బాలయ్య సైడ్ నుంచే కావాలి. మరి ఎందుకు అంత అభ్యంతరం బాలయ్యకు అంటే..చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ముందు ఎన్టీఆర్ వైకాపా వైపు మొగ్గు చూపారని, జగన్ ను కలిసారని, అన్నింటికి మించి బాబు, బాలయ్యలకు వ్యతిరేకంగా కామెంట్ లు చేసారని. అవన్నీ రికార్డింగ్ లు గా కూడా అవతలి వైపునకు చేరాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి మించి, ఇప్పటికీ కొడాలి నానితో ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయిస్తున్నది ఎన్టీఆరే అని తెలుగుదేశం వర్గాల మాట.
నాని,ఎన్టీఆర్ వేరు కాదని, ఇద్దరూ ఒక్కటే అని, వారి మధ్య అంతటి అనుబంధం వుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, కొడాలి నాని విమర్శలు చేస్తుంటే, అవి ఎన్టీఆర్ చేయిస్తున్నట్లే భావిస్తున్నారట. కొడాలి నాని మరీ ముందుకు వెళ్లి బాబును అంత ఘాటైన పదాలతో విమర్శిస్తుంటే, అదంతా ఎన్టీఆర్ ప్రాప్టింగ్ అని ఫీలవుతున్నారట బాలయ్య వర్గీయులు.
పోనీ ఇలా అనుకుంటున్నారని తెలిసినపుడు, ఎన్టీఆర్ కొంచెం నానిని తగ్గమని చెప్పవచ్చు కదా? తనకు తన కెరీర్ ముఖ్యం అని తెలిసినపుడు, నానితో అనుబంధం పక్కన పెట్టడమో, ఆ లైన్ లో క్లారిటీ ఇవ్వడమో చేయచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం అభిమానులు.