నార్త్ కల్చర్..అందునా యూత్ కల్చర్ లో హగ్ అన్నది చాలా చాలా చిన్న విషయం. కానీ ఒక్కోసారి అదే వికటిస్తుంది..పూరి జగన్నాధ్ తయారు చేస్తున్న రోగ్ సినిమాలో ఆయేషా శర్మ (నేహా శర్మ సిస్టర్) కు ఈ హగ్ నే ఉద్వాసన చెప్పేలా చేసిందని వినికిడి. అది కూడా వారం పది రోజులు షూట్ చేసిన తరువాత.
ఇంతకీ టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసల సారాంశం ఏమిటంటే..రోగ్ వ్యవహారం అంతా చార్మి కంట్రోల్ లో వుందట. షూటింగ్ కు వచ్చినపుడల్లా..హాయ్..అంటూ ఆయేషా దర్శకుడు పూరికి హగ్ ఇవ్వడం చార్మికి నచ్చలేదట. ఓ రోజు పిలిచి సీరియస్ గానే చెప్పిందట..హగ్..లు గిగ్గులు జాంతా నై.. అని. మరి ఆ తరువాత మరేం జరిగిందో ఆయేషా ఆ ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేసేసింది. ఇప్పుడు నాగ్ చైతన్య 'మజ్ఞు'లో మూడో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.
అయితే పూరి ఆఫీసులో చార్మి లీలలు ఇంతటితో ఆగలేదని కూడా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరికి పర్మనెంట్ స్టిల్ ఫొటోగ్రాఫర్ కూడా బయటకు వెళ్లిపోవడానికి ఆమే కారణం అని అంటున్నారు. బిల్లులో చిత్తానికి కోతలు పెట్టడమే అందుకు కారణమట.
పూరికి అత్యంత సన్నిహితమైన నటుడు బహ్మాజీ ని కూడా అపాయింట్ మెంట్ వుండాలని,కబరు చేసినపుడు రమ్మని అని చార్మీ అనేసిందట. పాపం, బ్రహ్మాజీ చిన్నబుచ్చుకుని వెనక్కు వెళ్లాడట.
కట్ చేస్తే..
ఇప్పుడు చార్మీని పూరి తన ఆఫీసు వ్యవహారాల నుంచి బయటకు పంపాడు. మరీ గోల ఎక్కువవవుతోందని ఇలా నిర్ణయం తీసుకున్నా అని పూరి స్వయంగా కొందరు సన్నిహితులకుచెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు చార్మి బాధితులంతా ఆనందంతో గెంతులు వేస్తున్నారు. అవును..మరి ఆయేషా మళ్లీ పూరి ప్రాజెక్టులోకి అడుగు పెడుతుందా? ఏమో…చూడాలి.