ఈ మాట కూడా తప్పు పవన్ ప్లీజ్

అనీషా అంబ్రోస్..ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, పవన్ గబ్బర్ సింగ్ 2 హీరో అని చెబితే టక్కున గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు గోపాల గోపాల సినిమాలో ఆమెను చూసి…

అనీషా అంబ్రోస్..ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, పవన్ గబ్బర్ సింగ్ 2 హీరో అని చెబితే టక్కున గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు గోపాల గోపాల సినిమాలో ఆమెను చూసి ఇప్పుడు కిందా మీదా అవుతున్నారు. 

ఆమెకు పవన్ పక్కన హీరోయిన్ మెటీరియల్ అస్సలు లేదని మార్చితే బాగుండునని అంటున్నారు. కానీ ఈ వ్యవహారం పిల్లి మెడలో గంట కట్టే చందంగా వుంది. పవన్ కు ఎవరు చెబుతారు. ఇప్పటికే ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడం, ఆయన ‘నేను మాట ఇచ్చాను’ అన్న మూడు పదాలు మాత్రం చెప్పి ఊరుకోవడం జరిగిపోయిందని తెలుస్తోంది. 

అయితే అసలు పవన్ కు ఎలా పరిచయం, ఎప్పుడు ఎందుకు మాట ఇచ్చారు అన్నది తెలియదు. లేదా అనీషా ను తొలి సారి పరిచయం చేసిన నీలిమ తిరుమల శెట్టికి ఏమన్నా మాట ఇచ్చారా అన్నది కూడా తెలియదు. అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు సంపత్ నంది ఉదంతం గుర్తు చేస్తున్నారు. స్క్రిప్ట్ బాగా రాలేదన్న కారణం చెప్పి, ఆయనను గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు నుంచి తప్పించారు కదా..అలాగే అంతగా సూట్ కాలేదని చెప్పి, ఈమెను తప్పించాలని కోరుతున్నారు. 

గతంలో పంజా సమయంలో కూడా హీరోయిన్ విషయంలో పవన్ రాంగ్ చాయిస్ తీసుకున్నారనీ అంటున్నారు. కానీ పవన్ వ్యవహారం చూస్తే మాట తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమెను తన సినిమాకన్నా ముందు గోపాల గోపాలలో స్పెషల్ రోల్ లోకి తీసుకోవడం అంటే పవన్ కు తెలియకుండా, పవన్ లేకుండా జరగదు కదా?