అనిల్, శ్రీను క్యాంప్ ల్లో?

ప్రసవం అయిపొయినా, పురిటి వాసన పట్టే వుంటుంది. అది అంత సులువుగా పోదు. సినిమా హిట్ అయితే ఓకె. ఫ్లాపయితే మరీ కష్టం. సవాలక్ష లెక్కలు..సవాలక్ష ఫొన్లు..ఒక తలకాయ నొప్పి కాదు. పైగా మహేష్…

ప్రసవం అయిపొయినా, పురిటి వాసన పట్టే వుంటుంది. అది అంత సులువుగా పోదు. సినిమా హిట్ అయితే ఓకె. ఫ్లాపయితే మరీ కష్టం. సవాలక్ష లెక్కలు..సవాలక్ష ఫొన్లు..ఒక తలకాయ నొప్పి కాదు. పైగా మహేష్ కు ఫ్యాన్స్ సమస్య ఒకటి.

శ్రీను వైట్లకు ఫ్యాన్స్ నుంచి ఫోన్లు, అనిల్ సుంకరకు బయ్యర్ల నుంచి ఫోన్లు, వీటిని తట్టుకోవడం నరమానవుడి వల్ల కాదన్న రేంజ్ లో వున్నాయట. అందుకే కొన్నాళ్లు ప్రశాంతంగా ఎక్కడన్నా వుండి వస్తానని శ్రీను వైట్ల వెళ్తున్నాడని వినికిడి.

అనిల్ సుంకర అప్పుడే అమెరికాలో లాండ్ అయ్యారని సమాచారం. మీరు డయిల్ చేస్తున్న కాలర్లు మీకు అందుబాటులో లేరు. దయచేసి కొంత కాలం తరువాత డయిల్ చేయండి అనుకోవాల్సిందే.