ఆది ఎవరితో..?

సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అప్ కమింగ్ హీరో ఆది. పెళ్లి గ్యాప్ అయింది..ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. భాయ్ దెబ్బకు సినిమా లేకుండా కిందా మీదా అవుతున్న, వీరభద్రమ్ చౌదరి…

సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అప్ కమింగ్ హీరో ఆది. పెళ్లి గ్యాప్ అయింది..ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. భాయ్ దెబ్బకు సినిమా లేకుండా కిందా మీదా అవుతున్న, వీరభద్రమ్ చౌదరి ఓ లైన్ చెప్పాడు.అది డిస్కషన్ లో వుంది. 

మరోపక్క లవ్ లీ డైరక్టర్ జయ కూడా ఓ లైన్ చెప్పినట్లు వినికిడి. యూత్ లవ్ ఫ్యామిలీ అఫైర్స్ కు సంబంధించి అల్లిన ఓ కథ ను ఆదితో చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న తొక్కుడు బిళ్ల ప్రాజెక్టు కన్నా దీన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో బట్టి, ఆది ముందు ఏం సినిమా చేస్తాడన్నది ఇంకా తేలలేదు. 

నిజానికి వీరభద్రమ్ చౌదరి భాయ్ తరువాత గోపీచంద్ దగ్గర నుంచి అల్లరి నరేష్ వరకు చాలా మంది హీరోలను ప్రయత్నిస్తున్నాడు. అతని దగ్గర ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్సులు వున్నాయి. హీరోలే దొరకడం లేదు. మరి ఆది అయినా చిక్కుతాడో..లేక లవ్ లీ హిట్ ఇచ్చిన డైరక్టర్ కే ఓకె అంటాడో?