హారిక హాసిన బ్యానర్..ఇప్పుడు టాలీవుడ్ పెద్ద బ్యానర్ ల్లో ఒకటైపోయింది. జులాయితో మొదలైన ప్రయాణం, సత్యమూర్తి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దాదాపు 15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ప్రాజెక్ట్ అయింది ఆ సినిమా. బ్యానర్ పేరుకు రాధాకృష్ణ గారిదే అయినా, ఇందులో త్రివిక్రమ్ కు కూడా పార్టనర్ షిప్ వున్నట్లు వినికిడి. ఈ బ్యానర్ పై వచ్చే మూడో సినిమాకు కూడా త్రివిక్రమ్ నే దర్శకుడట.
అలా అని రాధాకృష్ణ, త్రివిక్రమ్ ముందే అనుకున్నారట. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా ఎవరు చేయాలనుకున్నా, అది మూడు వంతులు హారిక, హాసిని బ్యానర్ పైనే చేయాల్సి వుంటుంది. రాథాకృష్ణవి డబ్బులు, త్రివిక్రమ్ ది స్కిల్ అన్నమాట. ఈ లోగా ఏదైనా సినిమా చేయాల్సి వస్తే, రాధాకృష్ణగారి రెండో బ్యానర్ మాయాబజార్ మూవీస్ వుండనే వుంది.
అయితే దాన్ని చిన్న సినిమాలకు వుంచి, పెద్ద సినిమాలకే మరో బ్యానర్ కూడా ప్రారంభించాలని చూస్తున్నారట. ఎందుకంటే హారిక హాసినిపై చేయాలంటే, త్రివిక్రమ్ కచ్చితంగా వుండాలి. ఆయనతో ప్రాజెక్టు సెట్ అయ్యే లోగా, టైమ్ వేస్ట్ కాకుండా వుండేందుకు మరో బ్యానర్ కూడా ప్రారంభిస్తారని వినికిడి. బహుశా ఈ కొత్త బ్యానర్ తొలి ప్రాజెక్టు నాగచైతన్యతో అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే హారిక, హాసిని హ్యాట్రిక్ ప్రాజెక్టు మూడు వంతులు మహేష్ లేదా ఒక వంతు అఖిల్ రెండో సినిమా కావచ్చని తెలుస్తోంది.