తడబడి నిలబడ్డ ఆసీస్‌

పాకిస్తాన్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత తడబడినా, ఆ తర్వాత తేరుకున్నట్లే కన్పిస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌, 213 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం విదితమే. లక్ష్యం చిన్నదే…

పాకిస్తాన్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత తడబడినా, ఆ తర్వాత తేరుకున్నట్లే కన్పిస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌, 213 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం విదితమే. లక్ష్యం చిన్నదే కావడంతో ఆస్ట్రేలియా గెలుపు నల్లేరు మీద నడకేనని అంతా అనుకున్నారు. అయితే 59 పరుగులకే 3 పరుగులు కోల్పోయి ఆసీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

ఈ దశలో స్టీవెన్‌ స్మిత్‌, షేన్‌ వాట్సన్‌ జాగ్రత్తపడ్డారు. ఇరువురూ ఆచి తూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఫలితంగా 22 ఓవర్లలో ఆసీస్‌ స్కోర్‌ 123 పరుగులకు చేరుకుంది. విజయానికి ఆసీస్‌ మరో 91 పరుగులు చేయాల్సి వుంది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో కుదురుకున్న దరిమిలా, పాకిస్తాన్‌కి వికెట్లు రాలడం కష్టమే.

మ్యాజిక్‌ స్పెల్‌ పాకిస్తాన్‌ వేయగలిగితే మాత్రం మ్యాచ్‌ పాకిస్తాన్‌ వైపుకు తిరుగుతుంది. లేదంటే, ఆస్ట్రేలియా సెమీస్‌కి వెళ్ళడం, పాకిస్తాన్‌ ఇంటికి వెళ్ళడం ఖాయమైపోతుంది. షేన్‌ వాట్సన్‌, స్టీవ్‌ స్మిత్‌.. ఇద్దరూ ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌ కావడంతో.. వీలైనంత త్వరగా మ్యాచ్‌ ముగిసే అవకాశముంది. తమ జట్టును సెమీస్‌కి చేర్చాలంటే మాత్రం పాక్‌ బౌలర్లు చెమటోడ్చాల్సి వుంటుంది.