క‌ళ్లు క‌లిపినంత మాత్రానా ప్రేమ కాదు!

నా వైపే చూస్తోంది అనిపించ‌డ‌మో, లేదా నీ వైపే చూస్తోంద‌ని ఇంకొక‌రు చెప్ప‌డ‌మో చేయ‌గానే.. రెచ్చిపోయి ముందుకు వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించుకోవాలి

మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ప్రేమిస్తున్నారంటే…దానికి దాఖ‌లాలు ఇవిగో అంటూ సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ కొన్ని సిద్ధాంతాల‌ను రాసున్న పోస్టులు క‌నిపిస్తూ ఉంటాయి. వారు మీతో ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేయ‌డానికి త‌ర‌చూ ప్ర‌య‌త్నిస్తార‌ని, వారు మీరు చెప్పే జోకుల‌కు బాగా న‌వ్వుతార‌ని, మీ పై త‌ర‌చూ అటెన్ష‌న్ చూపిస్తార‌ని, మీరు మ‌రొక‌రితో సాన్నిహిత్యంగా ఉంటే జ‌ల‌సీ చెందుతార‌ని.. ఇలా ఉంటాయి ఆ సిద్ధాంతాలు!

అయితే.. మ‌రి ఎవ‌రైనా ఇలాంటి త‌ర‌హాలో మీతో ప్ర‌వ‌ర్తిస్తే వారు మీకు ప‌డిపోయార‌ని, మీరంటే ప‌డి చ‌స్తున్నార‌ని అనుకుంటే మాత్రం పొర‌పాటు ప‌డుతున్న‌ట్టే! అలా అనుకుని వారితో చొర‌వ‌చూపి దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తే ఒక్కోసారి బొక్క‌బోర్లా ప‌డే ప‌రిస్థితి కూడా ఎదురుకావొచ్చు!

పై ల‌క్ష‌ణాల‌న్నీ ఎవ‌రిలోనైనా మీకు క‌నిపిస్తే.. వారు మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్న‌ట్టుగా ఊహించేసుకోక‌పోవ‌డ‌మే మంచిది. బ‌హుశా ఎవ‌రైనా మీతో పై ల‌క్ష‌ణాల‌తో ప్ర‌వ‌ర్తిస్తున్నారంటే మీపై వారికి ఆక‌ర్ష‌ణ ఉండ‌వ‌చ్చు! అది వారి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తాత్కాలికమైన ఆక‌ర్ష‌ణ కూడా కావొచ్చు! ప్ర‌త్యేకించి అమ్మాయిలు పై త‌ర‌హాలో ప్ర‌వ‌ర్తిస్తే మాత్రం అతిగా ఊహించుకోక‌పోవ‌డం అబ్బాయిల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవ‌రైనా అమ్మాయి మీరు త‌న‌వైపు చూసే టైమ్ కు స‌రిగ్గా మీ వైపే చూస్తూ ప‌ట్టుబ‌డుతుంది.

లేదా త‌ర‌చూ మీతో ఐ కాంటాక్ట్ క‌ల‌ప‌డ‌మో లేదా మీ వైపే చూస్తూ ఉండ‌ట‌మో చూస్తూ ఉంటుంది. త‌దేకంగా, ఆరాధ‌న పూర్వ‌కంగా ఆమె మీ వైపు చూడ‌వ‌చ్చు. మీ వైపు నుంచి చూపు తిప్పుకోవ‌డానికి కూడా త‌ను క‌ష్ట‌ప‌డుతూ ఉండ‌వ‌చ్చు. అబ్బాయిలు స‌హ‌జంగా ఇలాంటి పరిస్థితుల‌ను ఎదుర్కొనేది బాగా ఇష్ట‌మైన అమ్మాయి విష‌యంలోనే! ఎవ‌రైనా అమ్మాయి ఆక‌ర్ష‌ణ‌లో ప‌డిన‌ప్పుడు ఇలాంటి త‌ర‌హా లో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు అబ్బాయిలు. అయితే అమ్మాయిల ప‌రిస్థితులు వేరే అని చెప్పాలి!

అమ్మాయి మీ వైపే చూస్తూ త‌రచూ మీకు చిక్కినా, ఆమె మీపై ఆస‌క్తి చూపుతున్న‌ట్టుగా క‌నిపించినా.. మీరు అప్రోచ్ కావ‌డం మొద‌లుపెడితే ఆమె తీరు మారిపోతుంది! మీరు అప్రోచ్ కానంత వ‌ర‌కూ ఇలానే వ్య‌వ‌హ‌రించినా ఒక్క‌సారి మీరు త‌న వైపుకు వెళ్ల‌డం మొద‌లైన త‌ర్వాత త‌న తీరులో చాలా మార్పు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ త‌ను ఏం చేయ‌న‌ట్టుగా, అప్ప‌టి వ‌ర‌కూ త‌ను చేసిందేదీ త‌ను గుర్తుంచుకోని త‌ర‌హాలో స‌ద‌రు అమ్మాయి స్పందించే అవ‌కాశాలే ఎక్కువ‌!

ప్ర‌త్యేకించి ఇద్ద‌రి వయ‌సులో వ్య‌త్యాసాలు, వైవాహిక స్థితిలో బేధాలు, ఇత‌ర తేడాలు.. ఆల్రెడీ త‌ను మ‌రో బంధంలో ఉండ‌టం.. ఇలాంటి కార‌ణాల రీత్యా ఆమె మీతో పాజిటివ్ గా స్పందించ‌డం క‌న్నా, మీరు చొర‌వ చూపితే మీరేదో ఇబ్బంది పెడుతున్న‌ట్టుగా ఫీల‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి! అరుదైన సంద‌ర్భాల్లో మాత్ర‌మే ఇలాంటి క‌థ‌లు ప్రేమ‌క‌థ‌లుగా మారొచ్చు!

నా వైపే చూస్తోంది అనిపించ‌డ‌మో, లేదా నీ వైపే చూస్తోంద‌ని ఇంకొక‌రు చెప్ప‌డ‌మో చేయ‌గానే.. రెచ్చిపోయి ముందుకు వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించుకోవాలి! ప్ర‌త్యేకించి ఇంట్రావ‌ర్ట్ త‌ర‌హా ల‌క్ష‌ణాలు ఉన్న వారు ఈ విష‌యాన్ని గుర్తెరిగి న‌డుచుకోవ‌డం మంచిది. అమ్మాయిల చూపుల‌ను డీకోడ్ చేసుకోవ‌డంలో జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది. ఆమె మీ వైపే కాకుండా, మ‌రొక‌రి వైపు కూడా అలానే చూస్తూ ఉండ‌వ‌చ్చు! త‌న చూపులు అలా కావొచ్చు, త‌న నైజం అలాంటిది కావొచ్చు! అయితే అతిగా ఊహించుకుంటే మాత్రం భంగ‌ప‌డాల్సిన ప‌రిస్థితులు ఎదురుకావొచ్చు.

అయితే ఒక‌టి మాత్రం నిజం, ఎవ‌రైనా అమ్మాయి మీ వైపు అలా చూస్తోందంటే మాత్రం మీలో ఆక‌ర్ష‌ణ ఉంద‌ని మాత్రం రుజువు అవుతున్న‌ట్టే! ఆ చూపుల త‌ర్వాత మీరు అప్రోచ్ అయిన‌ప్పుడు ఆమె స్పందించ‌డంలో చాలా నాట‌క‌మే ఉన్నా, చూపులు క‌లుస్తున్నాయంటే మాత్రం మీలో ఎదుటి వారిని ఆక‌ర్షించే శ‌క్తి ఉన్న‌ట్టే! మ‌రి ఆ ఆక‌ర్ష‌ణ శ‌క్తిని ప్రేమ అయ‌స్కాంతంగా మార్చుకోవ‌డం మాత్రం ఒక క‌ళ‌!

11 Replies to “క‌ళ్లు క‌లిపినంత మాత్రానా ప్రేమ కాదు!”

  1. రేపేమిటి? ‘వొళ్ళు-వొళ్లు కలిపినంత మాత్రాన ప్రేమ కాబోదు. తన 99 వ ప్రణయ కథ కూడా కొండెక్కాక ఆమె యొక్క rebound మీరయ్యుండొచ్చు’ అని వ్రాస్తాడు. అయినా కొడుకుని ఎదురుగా కోఇర్చోబెట్టుకొని చెప్పుకోక ఇక్కడ ఎందుకు వగస్తారు?

  2. ఆడా మగా మధ్య ఉండేది కామం మాత్రమే.. అదే ప్రకృతి సహజం.. అదే సృష్టి రహస్యం.. ఆ కామాన్ని అదుపు చేసే ప్రక్రియే వివాహ వ్యవస్థ.. ఇప్పుడు ఎలాగో అన్నీ సంప్రదాయ వ్యవస్థలు చచ్చాయి కాబట్టి.. కామం కట్టలు తెంచుకొని చెలియలకట్ట తెగిన సునామీ లాగా సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాది…

    1. chinna savarana…ఆ కామాన్ని అదుపు చేసే ప్రక్రియే వివాహ వ్యవస్థ..kaadu

      ఆ కామాన్ని ధర్మ బద్ధం గ తీర్చుకుని మానవ జాతి మనుగడని ముందుకు తీసుకెళ్ళె వ్యవస్థ ..వివాహ వ్యవస్థ…

      ఇవి పాటించకపొతె జీవితాంతం అవస్థలె

  3. నేను ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉన్నాను నేను తనను చూస్తూన్న ఆని తనకు తెలుసు . ఎందుకంటే తనను చూస్తూన్న అని తెలిసిన నాకు తను నన్ను చూస్తూన్నదోలేదో తెలుగు కోవాలి అనుకొని తను చూస్తూన్నదోలేదో అని నేను కనపడకుండా తనని చూస్తూ ఉన్నప్పుడు తను నేను తనని చూస్తున్ననా లేదో అని చూస్తుంది . కాని తనని డైరెక్టుగా అడుగ లేకపోతున్నాను. అడిగిన తర్వాత తనకిi ఏమి తెలీదు అన్నట్టుగా అంటున్నదో అని భయం కాని నేను తనని చూస్తున్న సమయంలో తనను నన్ను చూస్తున్నప్పుడు ఆధారం (ఆధారం క్రింద నేను చూపించేది ఖచ్చితంగా తనకు తెలుసు ఆ ఆధారంలో తనను నేను చూస్తున్నప్పుడు తనను నన్ను చూడడం కనపడుతూంది ) కూడా నా దగ్గర వుంది కానీ దానిని చూపించి అడిగితే ఏమని అంటున్నదో అని భయం. ధైర్యం చేసి అడిగితే ఎలా ఉంటుంది ??? సలహా ఇవ్వండి

Comments are closed.