ఒకప్పుడు గ్రేహౌండ్స్ పోలీసు.. ఇప్పుడు కిడ్నాపర్‌గా మారాడు. దురలవాట్లకు బానిసై, లగ్జరీ లైఫ్‌కి ఆకర్షితుడై కిడ్నాప్‌ల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గన్ను పట్టాడు. విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం తెగించే ఉన్నతమైన పోలీసు ఉద్యోగాన్ని లైట్ తీసుకుని, కిడ్నాపింగ్ల ద్వారా లక్షలు గడిరచే మార్గాన్ని ఎంచుకున్నాడు ఓబులేసు.
హైద్రాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏకే47తో ఎటాక్ చేసిన ఓబులేసును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. డబ్బు మీద ఆశతో కిడ్నాప్‌లకు ఓబులేసు పాల్పడుతున్నాడనీ, గత ఫిబ్రవరిలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి 10 లక్షలు సంపాదించాడని హైద్రాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి వెల్లడిరచారు.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, 12 ఏళ్ళ పాటు గ్రేహౌండ్స్‌లో చాలా బాగా విధులు నిర్వహించాడని ఓబులేసుపై హైద్రాబాద్ సీపీ ప్రశంసలు గుప్పించడం. ఒక్కడే కిడ్నాప్ వ్యవహారాలు నడిపేవాడనీ, గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు తీసుకున్న ట్రెయినింగ్ అతని తెలివితేటల్ని షార్ప్‌గా చేసిందనీ, దురదృష్టవశాత్తూ అసాంఫీుక కార్యకలాపాలకు ఓబులేసు ఉపయోగించాడని హైద్రాబాద్ సీపీ చెప్పుకొచ్చారు.
కిడ్నాప్ యత్నంలో ఎవరికీ గాయాలు కాకపోయినప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన ఏకే47ని దొంగలించడంతోపాటు, దాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిన దరిమిలా, చాలా కఠినంగా ఈ కేసు విషయమై వ్యవహరిస్తామని హైద్రాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే 2014 డిసెంబర్లో ఏకే47 వెపన్ మిస్ అయితే, అప్పటినుంచీ ఇప్పటిదాకా.. వెపన్ రికవరీ విషయంలో విచారణ ఎందుకు నత్తనడక నడిచినట్టు.?