క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్. అలాంటి దిగ్గజం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ఒక్కసారిగా క్రికెట్ ప్రియులకు నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. చక్కటి ఆటతీరుతో అందరినీ ఆకట్టుకునే సచిన్‌లాంటి ఆటగాడు ఆటనుండి తప్పుకుంటానంటే ఎవరైనా బాధపడతారు. అలాంటి ఆటగాడు ఆటనుండి అప్పుడే తప్పుకోకూడదని, సచిన్ లాంటి ఆటగాడు సంప్రదాయ క్రికెట్‌కు ఎంతైనా అవసరమని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడుతున్నారు.
పాతికేళ్లుగా క్రికెట్‌లో నిలిచివున్నాడంటే అతను ఎంతటి సమర్ధుడైన ఆటగాడై ఉండాలి. సచిన్ తన తొలి సెంచరీనుండి ఇప్పటి వరకూ ఎన్ని సెంచరీలు చేసినా అతరిలో ఒకటే భావం ముఖంలో కదలాడుతుంది.
ఇదే విషయాన్ని గురించి రణతుంగ మాట్లాడుతూ సచిన్ ఇంకో లక్ష పరుగులు చేసినా అతడిలో ఎలాంటి మార్పు రాదని, అంతటి వినయం కలిగినవ్యక్తి అని, టెండూ ల్కర్ ఇంకొంత కాలం ఆట ఆడాలని తాను కోరుకుంటున్నానని, నేటితరం ఆటగాళ్లకు సచిన్ లాంటి ఆటగాడు ఎంతైనా అవసరమని, అతను మరికొంత కాలం ఆడటం ఉత్తమం అని రణతుంగా అన్నారు. తాను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే సమయానికి తనకు వేరే వ్యాపకాలున్నాయని, అయితే సచిన్ సచిన్ మాత్రం క్రికెట్‌నే తాగుతాడు, తింటాడని అలాంటి వ్యక్తి క్రికెట్‌ని వీడడం అనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎంత కష్టపడివుంటారో అని అంటున్నారు.
సచిన్ లాంటి ఆటగాడు క్రికెట్‌నుండి తప్పుకోవడం అనేది నిజంగా చాలామందికి ఇష్టం లేదు. రణతుంగ లాంటి ఆటగాడు సచిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మాస్టర్ ఈ విషయా లను గమనిస్తున్నారా.. గమనించి తన నిర్ణయంలో ఏమైనా మార్పులు చేసుకుంటారా…?