ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా చిత్రం నెగటివ్ టాక్‌తో నడుస్తుండడం అనేది.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పెద్ద గండంలాగా మారింది. ఈ సినిమా చేతులు కాల్చేసినట్లే అని డిసైడ్ కావడంతో ఇక జూనియర్ ఎన్టీఆర్ సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న తర్వాతి చిత్రం రభసకు సంబంధించి… కథలో అనేకానేక మార్పు చేర్పులు చెప్పి ముందుగా అవన్నీ చేసుకురమ్మని పురమాయించాట్ట.
హరీష్ శంకర్ ` గబ్బర్ సింగ్ వంటి హిట్ ఇచ్చే సరికి అతడి చేతిలో పడితే కుదుపుల మయంగా సాగుతున్న తన కెరీర్‌కు ఓ బ్లాక్ బస్టర్ ఇస్తాడులే అని ఆశించిన జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమా విడుదల అయ్యాక భంగపాటు తప్పలేదు. భారీ హిట్ మీద కన్నేసిన జూనియర్‌కు.. ఈ చిత్రం ఆవరేజి హిట్ రేంజిని అందుకోవడానికే ఇబ్బంది పడే రీతిలో తయారవుతుండడం అనేది.. చిరాకు తెప్పించింది. అందుకే ఈ సారి చిత్రానికి మరిన్ని జాగ్త్రత్తలు తీసుకుంటే తప్ప.. ఈ మాత్రం విజయం కూడా దక్కదని భావించాడుట.
గతంలో హీరో రాం తో కందిరీగి చిత్రాన్ని రూపొందించి, బ్లాక్ బస్టర్ కాకపోయినా సరే టేలెంట్ ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్‌కు జూనియర్ ఒక అవకాశం ఇచ్చాడు. రభస అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే రామయ్య చేదు ఫలితం ఇవ్వడంతో ఎన్టీఆర్ ఏం ఫీలయ్యాడో ఏమో గానీ.. రభస కథలో బోలెడు మార్పులు చెప్పి.. ముందు ఆ మార్పు చేర్పులు అన్నీ చేసుకురమ్మని దర్శకుడిని పురమాయించాట్ట.
పాపం.. ముందుగా పక్కాగా తయారుచేసుకున్న కథను ఇలాంటి ఆపపద్ధర్మ మార్పులు అనేవి భ్రష్టు పట్టించేస్తాయేమోనని ఒకవైపు భయపడుతూ.. మరో వైపు ఆ ఫీలింగ్‌ను హీరోగారికి చెప్పలేక సతమతం అయిపోతున్నాట్ట.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.