పాత రికార్డులు బ‌ద్ధ‌లైన 2023 ప్ర‌పంచ‌క‌ప్!

2023 క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ బోలెడ‌న్ని పాత రికార్డుల బ‌ద్ధ‌లుకు వేదిక అయ్యింది. ప్ర‌త్యేకించి బ్యాటింగ్ పిచ్ ల‌పై జ‌రిగిన ప‌లు మ్యాచ్ ల‌లో పాత రికార్డుల‌న్నీ తెర‌మ‌రుగు అయ్యాయి. కొంద‌రు ఆట‌గాళ్ల వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న…

2023 క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ బోలెడ‌న్ని పాత రికార్డుల బ‌ద్ధ‌లుకు వేదిక అయ్యింది. ప్ర‌త్యేకించి బ్యాటింగ్ పిచ్ ల‌పై జ‌రిగిన ప‌లు మ్యాచ్ ల‌లో పాత రికార్డుల‌న్నీ తెర‌మ‌రుగు అయ్యాయి. కొంద‌రు ఆట‌గాళ్ల వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న కూడా కొత్త రికార్డుల‌ను సృష్టించింది. 

ఒకే ప్ర‌పంచ‌క‌ప్ లో అత్య‌ధిక ప‌రుగుల విష‌యంలో స‌చిన్ రికార్డును విరాట్ కొహ్లీ త‌న పేరిట‌కు మార్చుకున్నాడు. 2003 ప్ర‌పంచ‌క‌ప్ లో స‌చిన్ 673 ప‌రుగులు చేసి సెట్ చేసిన రికార్డు ఇర‌వై యేళ్ల త‌ర్వాత బ‌ద్ధ‌లైంది. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్ లో విరాట్ కొహ్లీ 765 ప‌రుగులు చేసి కొత్త రికార్డును స్థాపించాడు.

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో అత్య‌ధిక సెంచ‌రీల విష‌యంలో రోహిత్ శ‌ర్మ కూడా స‌చిన్ రికార్డును అధిగ‌మించాడు. స‌చిన్ ప్ర‌పంచ‌క‌ప్ ల‌లో ఆరు సెంచ‌రీలు సాధించ‌గా, రోహిత్ శ‌ర్మ ఏడో సెంచ‌రీని కొట్టాడు. త‌ద్వారా ప్ర‌పంచ‌క‌ప్ ల‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్ గా నిలిచాడు.

ఒక ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డు స‌వ‌రించ‌బ‌డింది. సౌతాఫ్రిక‌న్ బ్యాట్స్ మన్ మార్క్ ర‌మ్ 49 బంతుల్లో సెంచ‌రీని చేసి ఫాస్టెస్ట్ సెంచ‌రీ ఫీట్ ను న‌మోదు చేశాడు. 

అలాగే శ్రీలంక‌పై సౌతాఫ్రికా 428 ప‌రుగులు చేయ‌డం ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్  బెస్ట్ స్కోరును రికార్డు చేసింది. ఇది వ‌ర‌కూ ఆఫ్గానిస్తాన్ పై ఆస్ట్రేలియా సెట్ చేసిన 415 ప‌రుగుల రికార్డును సౌతాఫ్రికా అధిగ‌మించింది. అలాగే చేజింగ్ రికార్డు కూడా ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో సెట్ చేయ‌బ‌డింది. శ్రీలంక‌పై జ‌రిగిన‌ మ్యాచ్ లో పాకిస్తాన్ 345 ప‌రుగులు చేయ‌డం ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీలో భారీ స్కోరును చేజ్ చేసిన రికార్డును సొంతం చేసుకుంది.

ఇక ఈ ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం ద్వారా ఆస్ట్రేలియా ఆరోసారి ప్ర‌పంచ‌క‌ప్ ను సాధించిన అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆస్ట్రేలియా ఆరు సార్లు, వెస్టిండీస్, ఇండియా రెండు ప‌ర్యాయాలు విజేత‌లుగా నిలిచాయి. పాకిస్తాన్, శ్రీలంక‌, ఇంగ్లండ్ జ‌ట్లు ఒక్కో ప‌ర్యాయం ప్ర‌పంచ విజేత‌గా నిలిచాయి.