1). పబ్‌లో పార్టీ చేసుకున్న రాహుల్ -పార్టీ పనుల్లోనే కదా వున్నాడు
2). ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ -సలహాల వ్యాపారంలో లాభాలు తగ్గినట్టున్నాయి
3). కాపీలు కొట్టిస్తున్న కార్పొరేట్ స్కూళ్లు -అది వాళ్ల కాపీ రైట్
4). ఈ రోజు హెడ్డింగులు -నగల దుకాణాలు కిటకిట, కరెంట్‌కి కటకట
5). టీడీపీ అభిమాని ఆవేదన -లోకేష్ సైకిల్ యాత్ర అంటున్నాడు. ఆయన ఎక్కి తొక్కడం వల్లే పార్టీ ఈ గతికి వచ్చింది
6). ప్రజాచైతన్యమే లక్ష్యం -చంద్రబాబు -చైతన్యం వల్లే మీరు మాజీ అయ్యారు
7). తెలంగాణలో సంపద సృష్టించాం -చంద్రబాబు -అరచేతిలో వైకుంఠం సామెత మీ వల్లే పుట్టినట్టుంది
8). 150 దేశాలను వణికించాను -కెఎ. పాల్ -ఎవరికైనా చూపించండి, అలా వదిలేయకండి
9). సింగిల్ ఆర్టిస్ట్‌గా బండ్ల గణేష్ “డేగల బాబ్జీష -ఆడియన్స్ అయినా డబుల్ వుంటారా?
10). సినీ అభిమాని కామెంట్ -విష్వక్సేన్ పేరు పలకడమే కష్టమనుకుంటే.. ఆయన తిట్లు పలకడం ఇంకా కష్టం
-జీఆర్ మహర్షి