మరి మిగతా పాశ్చాత్య దేశస్తుల పరిస్థితి ఏమిటో పూర్తిగా తెలియడం లేదు కానీ… అమెరికన్లు మాత్రం ఈ విషయంలో తమకు ఎలాంటి మొహమాటం లేదని చాటుకుంటున్నారు. విలువలు, బంధాలు, అనుబంధాలు.. అన్నీ తర్వాతి సంగతి, సెక్సువల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు అమెరికన్లు.
ఇది ఎవరో అమెరికా అంటే పడనివాళ్లు చెబుతున్న మాట కాదు.. సాక్షాత్ అమెరికన్ ప్రభుత్వ అధికారిక హెల్త్ సర్వే ఒకటి తేల్చిన నిజం. దేశంలో ప్రజల వ్యవహారాలపై అమెరికన్ గవర్నమెంట్ హెల్త్ విభాగం చేయించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
సగటున పద్దెనిమిదేళ్లకు అమెరికాలో యువతీయువకులు సెక్స్ జీవితాన్ని ఆరంభిస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది. కొందరు అంతకన్నా ముందే సెక్స్ అనుభవాన్ని పొందవచ్చు, మరికొందరు కాస్త లేట్ కావొచ్చు.
యావరేజ్ మీద అయితే పద్దెనిమిదేళ్లకు అక్కడి యువతీయువకులు అనుభవాలను పొందుతున్నారట. ఈ విషయంలో అమెరికన్లు కాస్త కరెక్టుగా ఉన్నట్టే.
అలా మొదలుపెట్టిన శృంగార జీవితాన్ని తనివితీరా ఆస్వాధిస్తున్నారట అమెరికన్లు. శృంగార జీవితం ఒక భాగస్వామితోనే ముడిపడి ఉండాలనే నియమం ఉన్న దేశం కాదు కదా.. అది.
ఈ విషయంలో అమెరికన్లకు కట్టుబాట్లు ఏమీలేవు. పెళ్లి చేసుకోవడమూ మామూలే, విడాకులూ మామూలే. ఇక వన్నైట్ స్టాండ్స్‌కు, సహజీవనాలకు అడ్డే లేదు. దీంతో ఒక్కో అమెరికన్ అనేక మందితో శృంగారానుభవాలను పంచుకుంటున్నట్టుగా ఆ సర్వేలో తేలింది.
పది, పన్నెండు మందితో సెక్సువల్ ఎఫైర్స్ కలిగిన వారు అమెరికన్ సమాజంలో బోలెడంత మంది కనిపిస్తున్నారని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. ఆడ, మగ అనే తేడాలు లేవు.. చాలా మంది తీరు అలానే ఉందని ఆ సర్వే తేల్చింది.
22శాతం మంది మగాళ్లు తాము కనీసం పదిహేను మంది మహిళలతో సెక్స్ అనుభవాలను కలిగి ఉన్నామని చెప్పుకొచ్చారట. మహిళల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఇలాంటి వారున్నారు. తాము పది, పదిహేను మందితో బెడ్రూమ్ అనుభవాలను కలిగి ఉన్నామని వారు వివరించారట.
కొందరు అలా రెచ్చిపోతూ ఉన్నారు. వీలైనంత మందితో సెక్స్ అనుభవాలను పంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, సహజీవనాలు, లైంగిక సంబంధాలు.. చాలా సులభంగా జరగడం, అంతే వేగంగా తెగిపోయే వ్యవహారాలు కాబట్టి అమెరికన్లకు అన్నన్ని అనుభవాలు సాధ్యం అవుతున్నాయి.
మరి సగటున చూస్తే.. ఒక్కో అమెరికన్ కనీసం నలుగురి సాటి అమెరికన్లతో సెక్స్ బంధాన్ని కలిగి ఉన్నారని ఈ సర్వేలో తేలింది. ఆడ, మగ అనే తేడాలు లేకుండా.. ఒక్కోరు నలుగురితో సెక్స్ అనుభవాన్ని కలిగి ఉన్నారట. అనేక యూరోపియన్ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండొచ్చు.