మ‌గాడు ఎందుకు వివాహేత‌రం వైపు చూస్తాడంటే!

ఔన‌న్నా, కాద‌న్నా.. స‌నాత‌నం, సంప్ర‌దాయం అంటూ ఎన్ని చెప్పినా, మ‌న స‌మాజంలో అక్ర‌మ సంబంధాలు బోలెడు! ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌తి మ‌నిషి జీవితంలోనూ ఏదో ఒక ద‌శ‌లో ఇలాంటి వ్య‌వ‌హారాలు ఉంటాయి. ప్ర‌త్యేకించి…

ఔన‌న్నా, కాద‌న్నా.. స‌నాత‌నం, సంప్ర‌దాయం అంటూ ఎన్ని చెప్పినా, మ‌న స‌మాజంలో అక్ర‌మ సంబంధాలు బోలెడు! ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌తి మ‌నిషి జీవితంలోనూ ఏదో ఒక ద‌శ‌లో ఇలాంటి వ్య‌వ‌హారాలు ఉంటాయి. ప్ర‌త్యేకించి మ‌గవాడి వైపు నుంచి చూస్తే.. యుక్త వ‌య‌సుకు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అనైతికం అనుకోని, అక్ర‌మం అనుకోని, కేవ‌లం శృంగారం అని వాదించ‌ని.. ఈ వ్య‌వ‌హారాల‌వైపు చూడ‌ని వాడంటూ ఉండ‌డు!

ఒక‌వేళ ఎవ‌రైనా త‌మ‌కు అలాంటి ఆలోచ‌నే లేద‌ని అంటే, వారు అబ‌ద్ధ‌మైనా చెబుతూ ఉండాలి, లేదా వారిలో ఏదైనా లోపం ఉండాలి! పెళ్లికి ముందు కావొచ్చు, పెళ్లి త‌ర్వాత కావొచ్చు.. ఇలాంటి సంబంధాల ప‌ట్ల మ‌గ‌వాళ్లు ఆస‌క్తితోనే ఉంటారు! అవ‌కాశం దొరికితే.. అలాంటి అవ‌కాశాన్ని వాడుకోవాల‌ని ఆలోచించ‌ని ప్ర‌బుద్ధుడంటూ ఉండ‌డు! మరి ఇది అతి స‌హజం అనొచ్చునేమో! మ‌నిషి కూడా జంతువు అని ఒప్పేసుకోగ‌లిగితే.. ఇది స‌హ‌జ‌మే. అలాంట‌ప్పుడు స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ ఇది స‌హ‌జం అవుతుంది.

మ‌నిషి సామాజిక జంతువు కాబ‌ట్టి, ఇక్క‌డ మ‌గాడికి కొన్ని క‌ట్టుబాట్ల‌లో మిన‌హాయింపులు ఇచ్చేయ‌బ‌డ్డాయి కాబ‌ట్టి.. ఇలాంటి వ్య‌వ‌హారాల్లో చొర‌వ‌, ప్ర‌య‌త్నాలు మ‌గాడి వైపు నుంచినే ఎక్కువ‌గా ఉంటాయి. మ‌రి ఇందుకు కొన్ని సైక‌లాజిక‌ల్ రీజ‌న్లు కూడా ఉన్నాయ‌నే అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తారు మానసిక శాస్త్ర ప‌రిశోధ‌కులు. వివాహేత‌ర సంబంధాలు అనే స‌బ్జెక్ట్ పై జ‌న‌ర‌లైజ్ శోధ‌న‌లు చేసిన వారు ఇందుకు ప‌లు కార‌ణాల‌ను చెబుతారు.

అది మ‌గ‌త‌నం అనుకోవ‌డం!

వివాహం అయినా స‌రే, మ‌రో అమ్మాయితో వ్య‌వ‌హార‌మో, మ‌రొక అతివ‌తో సంబంధ‌మో ఉండ‌టం మ‌గ‌త‌నానికి నిద‌ర్శ‌నం అనే భావ‌న త‌ర‌త‌రాల్లో ఉంది. మ‌గాడిగా త‌న ప‌ర‌ప‌తి చూపించుకోవ‌డానికి, త‌న మ‌గ‌త‌నం గొప్ప అనిపించుకోవ‌డానికి మ‌గ‌వాళ్లు ఇలాంటి చూపులు చూస్తార‌నేది ప్ర‌ముఖ‌మైన థియ‌రీ. కొన్నేళ్ల కింద‌టి వ‌ర‌కూ కూడా అలాంటి సంబంధం ఉంద‌ని బ‌య‌ట‌ప‌డ్డా.. మ‌గాడిని నిందిస్తూ చూసే వాళ్లు త‌క్కువ‌! భార్య కూడా త‌ప్ప‌నిస‌రిగా నోరెత్తే ప‌రిస్థితులు ఉండేవి కావు. అయితే రోజులు మారాయి. ఇండియాలో అయితే మ‌గ‌వాడికి మ‌రొక‌రితో సంబంధం కామ‌న్ అనేది రెండు మూడు ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కూ ఉండిన ప‌రిస్థితే. భార్య నోరెత్తే ప‌రిస్థితి ఉండేది కాదు. అలా శ‌తాబ్దాల నుంచి పురుష‌స్వామ్య వ్య‌వ‌స్థ‌లో వివాహేత‌ర సంబంధం అనేది మ‌గత‌నానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది. అదే అంత‌ర్లీనంగా కొన‌సాగుతూ ఉంది. ఇప్పుడు బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌పోయినా త‌న వ‌ర‌కూ త‌న మ‌గ‌తనానికి నిద‌ర్శ‌నంగా మ‌రో సంబంధాన్ని కోరుకునే స్థితిలో ఉన్నాడు పురుషుడు!

వైవాహికంలో ఎమోష‌న్ లేక‌పోవ‌డం!

మ‌గాడి ప‌క్క చూపుల వెనుక ఇది రెండో ప్ర‌ధాన కార‌ణం. పెళ్లి ర‌క‌ర‌కాల రీజ‌న్ల‌తో జ‌రుగుతుంది. ప్ర‌త్యేకించి అరేంజ్డ్ మ్యారేజ్ లు అయితే ర‌క‌ర‌కాల లెక్క‌లు, స‌మీక‌ర‌ణాల‌తో జ‌రుగుతాయి. అలా జ‌రిగిన పెళ్లిళ్ల‌లో ఆదిలోనే కావొచ్చు, కొన్ని రోజుల‌కు కావొచ్చు.. ఇద్ద‌రి మ‌ధ్య‌న ఎమోష‌నల్ క‌నెక్ష‌న్ ఏర్ప‌డ‌క‌పోవ‌డం అనేది మ‌గవాడిలో అదో లోటుగా మిగిలిపోతుంది. పైకి ఏమీ చెప్ప‌క‌పోవ‌చ్చు, చెప్ప‌లేక‌పోవ‌చ్చు, భ‌ర్త‌గా త‌న డ్యూటీల‌న్నీ స‌క్ర‌మంగానే చేస్తూ ఉన్నా.. ఎమోష‌న‌ల్ గా ఉన్న వ్యాక్యూమ్ ఫ‌లితంగా ప‌క్క చూపులు చూసే అవ‌కాశాలు ఉంటాయి.

దూర‌పు కొండ‌లు నునుపు అనుకోవ‌డం!

ఎవ‌రినో చూసి వారితో అనుబంధం కావొచ్చు, శృంగారం కావొచ్చు అద్భుతంగా ఉంటుంద‌ని అనుకోవ‌డం, దూరపు కొండు నునుపు అనే సామెత‌ను అర్థం చేసుకోక‌.. అలాంటి ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకుని వారి కోసం ప్ర‌య‌త్నించే తత్వం కూడా కొంద‌రిలో ఉంటుంది. మ‌గ‌వాడి ప‌క్క చూపుల‌కు ఇది మూడో ప్ర‌ముఖ‌మైన రీజ‌న్ అంటారు.

బోర‌డ‌మ్!

ఇది కూడా మ‌రో స‌హ‌జ‌మైన రీజ‌నే. ఈ విష‌యంలో ర‌క‌ర‌కాల థియ‌రీలున్నాయి. ఏడేళ్ల కాపురం త‌ర్వాత మ‌గ‌వాడి మ‌న‌సు మారుతుంద‌ని, భార్య పూర్తిగా బోర్ కొడుతుంద‌ని అప్పుడు ట్విస్టులు ఉంటాయ‌నే థియ‌రీ విదేశాల నుంచి కూడా వినిపిస్తూ ఉంటుంది. వైవాహిక జీవితంలో సెక్స్ బోర్ కొట్ట‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం కూడా లేదు. ఈ బోర్ డ‌మ్ ఇరు పార్టీల‌కూ ఉంటుంద‌నేది కూడా బ‌హిరంగ స‌త్యం. అయితే మ‌గాడు త‌న‌కున్న అడ్వాంటేజ్ ల‌ను వాడుకుంటూ ప‌క్క చూపుల అవ‌కాశాల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటాడు.

స‌క్సెస్ తెచ్చిన గ‌ర్వం!

జీవితంలో ఎంతో కొంత సాధించాకా కూడా కొంత‌మంది ఇలాంటి ఆలోచ‌న‌లు మొద‌ల‌వుతాయి. ఆర్థికంగా, సామాజికంగా ప‌ర‌ప‌తిని సంపాదించుకున్నాకా.. జీవితంలో తాము సాధించిన దానిపై సంతృప్తి క‌లిగి, ఆస్వాధించాల‌నే ఆలోచ‌న‌లు కూడా ప‌రుగులు పెడ‌తాయి. స‌క్సెస్ ఇచ్చే కిక్ కూడా కొంత‌మందిన ఇటువైపు న‌డిపిస్తుందని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

11 Replies to “మ‌గాడు ఎందుకు వివాహేత‌రం వైపు చూస్తాడంటే!”

  1. మరి మన సిమెంటు పెళ్ళికి ముందు నుంచె్ రహస్య సంబంధం తో ఆశ్వాదిస్తుంది… దాన్ని ఏమంటారు గొర్రె ఆంధ్ర..

  2. ఇవన్నీ ఆడది గడప దాటడం మూలంగా వచ్చిన అవకాశాలు.. అవకాశాలను అందరూ హాయిగా అందిన వరకు సద్వినియోగం చేసుకుంటారు మరి…

  3. alochana veru… prerana veru… acharana veru… alochana ke manishi chedipoyinattu kadu… manasu kothi lantidi…vanda alochanalu thesthadi…. kani acharana daka vellevallu entha mandi… 10% kuda undaru… kabatti ekkado rasina articles ni telugu loki translate chesi… pichi matalu rayakandi.. generalise cheyakandi

Comments are closed.