వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మోడీ క్లారిటీ..!

దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, “ఈ సారి జాతీయ ఏకతా దినోత్సవం ఒక అద్భుతమైన సమన్వయాన్ని తీసుకువచ్చింద‌ని.. ఒకవైపు ఏకతా పండుగను జరుపుకుంటున్నాం, మరోవైపు దీపావళి పండుగ జ‌రుపుకోవ‌డం సంతోషం”గా ఉంద‌న్నారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “వన్ నేషన్ వన్ ఎలక్షన్”తో ఒకే రోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే విధానం త్వరలోనే కాబోతోందని చెప్పారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, వనరుల వినియోగం మెరుగుపడుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన ఈ ఏడాది క్యాబినెట్ ఆమోదం పొందిందని.. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్ర‌క‌టించారు.

అలాగే ప్రతిపక్షాల గురించి ప్రస్తావిస్తూ, కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ ఐక్యతను బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాయని, అర్బన్ నక్సల్ కూటమిని ప్రజలు గుర్తించి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే, “వన్ నేషన్-వన్ సివిల్ కోడ్” కూడా దేశంలో అమలు దిశగా కొనసాగుతుందని, ఇది సెక్యులర్ కోడ్ అని తెలిపారు.

మరోవైపు, ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వాలు వివక్షపూరిత విధానాలు అనుసరించడం వల్ల దేశ ఐక్యత బలహీనపరిచాయని విమర్శించారు. “జీఎస్టీ ద్వారా ఒక దేశం, ఒక పన్ను విధానాన్ని, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా విధానాన్ని అందించాం. ఇప్పుడు దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం,” అని మోడీ తెలిపారు.

అయితే, ఈ ప్రతిపాదనపై కొంతమంది అనుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీని ద్వారా ప్రజాస్వామ్య విభజనకే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

6 Replies to “వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మోడీ క్లారిటీ..!”

  1. ఆ ఒక్క ఎలక్షన్ మాత్రం ఎందుకు పాపం, తీసేయండి.. రాజధాని అహ్మదాబాద్ కి తరలించండి, పరిపాలన మనకి పెట్టుబడి పెట్టే కార్పొరేట్ మిత్రులకు ఔట్ సోర్సింగ్ చేసేస్తే దేశవనరులు ఇంకా ఆదా అవుతాయి.. ప్రజలకు, భక్తులకు సోషల్ మీడియాలో వాదించుకోవడానికి ఉచిత అన్ లిమిటెడ్ డాటా ప్లాన్లు, నెలకో సంచలన సంఘటనలు ఉండేలా అరేంజ్ చేసుకుంటే, మీరు ఏం చేసుకున్నా, ఎలా అమ్ముకున్నా చలించరు.‌

Comments are closed.