కెరీర్ పరంగా అనసూయ, ప్రియాభవానీ శంకర్ కు మధ్య చాలా పోలికలున్నాయి. న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది అనసూయ. ప్రియా భవానీ శంకర్ కూడా అంతే. న్యూస్ యాంకర్ నుంచి నటిగా మారింది.
ఇది మాత్రమే కాదు, వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు కొత్తగా మరో సారూప్యత కూడా పుట్టుకొచ్చింది. తెలుగులో అనసూయ, తమిళ్ లో ప్రియా భవానీ శంకర్ పై ట్రోలింగ్ చాలా కామన్. తనపై రెగ్యులర్ గా జరిగే ట్రోలింగ్ ను అనసూయ గట్టిగా తిప్పికొడుతుంది. అక్కడ తమిళ్ లో ప్రియా భవానీ శంకర్ కూడా అదే పని చేస్తోంది.
రీసెంట్ గా సోషల్ మీడియా జనం ప్రియా భవానీ శంకర్ కు ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారు. అమ్ముడు ఏ సినిమాలో అడుగుపెడితే ఆ సినిమా ఫ్లాప్ అనే ప్రచారం ప్రారంభించారు. దీనికి కారణం భారతీయుడు-2 సినిమా. ఇందులో ఆమె ఉంది, అందుకే సినిమా ఫ్లాప్ అయిందనేది తమిళనాట సోషల్ మీడియా జనం మాట. ఈ వ్యాఖ్యల్ని ప్రియా భవానీ శంకర్ గట్టిగా తిప్పికొడుతోంది.
“నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదు. నేను నా పని చేస్తున్నాను. చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుందని అందరూ చెప్పలేరు కదా. ఇండియన్ 2 సినిమా హిట్ కానందుకు బాధగా ఉంది. కానీ ఆ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా పెద్ద విషయం. అయితే కొందరు నన్ను బాధపెట్టేలా మాట్లాడుతున్నారు.”
భారతీయుడు-2 సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ఎంత సంతోషించానో.. ఇప్పుడు అంత బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది ప్రియా భవానీ శంకర్. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ రాజ్ వేల్ అనే వ్యక్తితో పదేళ్లుగా డేటింగ్ లో ఉంది. వచ్చే ఏడాది అతడ్ని పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈమె తమిళ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తోంది.
జనం పట్టించుకోరు
Vc available 9380537747