ఓవర్ సీస్ లో టాలీవుడ్ ప్రతిస్పందనలు బాగానే వుంటున్నాయి. హీరోలు తమ సినిమా ఓవర్ సీస్ ఆడడాన్ని కూడా ప్రెస్టీజ్ గా తీసుకుంటున్నారు. ఓవర్ సీస్ లో నిత్యం టాలీవుడ్ లో ఏం జరుగుతోందో అన్న ఆసక్తి పెరిగిపోతోంది. దీంతో హీరోలు తరచు అక్కడకు వెళ్తూ వుండడం, తమ మార్కెట్ ను పెంచుకోవాలని ప్రయత్నించడం మామూలైపోయింది.
2015 డిసెంబర్ లో ఓ సినిమా వచ్చింది. దాని హీరో కాస్త ముందుగానే అమెరికా వెళ్లి ‘తమ వాళ్లని’ కాస్త కలిసి వచ్చాడట. తన సినిమా వచ్చినపుడు కాస్త కోపరేట్ చేయమని రిక్వెస్ట్ కూడా చేసి వచ్చాడట. దాంతో ఆ సినిమా విడుదలైనపుడు ‘మనవాడు’ కదా అని అందరూ కలసి ఓ పదిలక్షల వర్త్ టికెట్ లు కొన్ని స్పాన్సర్ చేసారట. ఆ విధంగా ఆ సినిమాకు తొలినాళ్ల వసూళ్లు ఈ రేంజ్ లో వచ్చాయి అని చెప్పుకోవడానికి వీలయిందట.
అయినా ఆ సినిమాకు సరిపడా కలెక్షన్లు రాలేదు..అది వేరే సంగతి అనుకోండి. అయినా ఏమిటో మన అమెరికా జనం…అక్కడికి వెళ్లి కష్టపడి సంపాదించి, సినిమాల మీద తగలెట్టేస్తున్నారు.