ఆగడు సినిమాలో కాస్త మోటు డైలాగులు, పదాలు కోతకు లేదా రీప్లేస్ కు గురయ్యాయట. ముఖ్యంగా ఓ పాటలో జంక్షన్ లో నా ఫంక్షన్, పంపు సెట్ రూమ్ లో కర్రా బిళ్లా ఆడేద్దామా.. అన్న పదాలు తొలిగించారని వినికిడి. అలాగే బొక్క, దూల తీరిందా, బొంగేం కాదు, నీయవ్వ లాంటి పదాలను మ్యూట్ చేసారట. బోకు యెదవ. బోకు నాయాల వంటి పదాలను మార్చారట.
అన్నింటికి మించి మీడియా మీద ఓ డైలాగు వుందట. మీడియాను రామ్ గోపాల్ వర్మ కొన్న విధంగా అని..దాన్ని మీడియాకు బదులు పబ్లిసిటీ అని మార్చినట్లు తెలుస్తోంది.
అన్నింటికన్నా ట్రయిలర్ లో పాపులరైన డిక్కీ బలిసిన కోడి అన్నదానికి బదులు మెక్కి బలిసిన కోడి అని మార్చారట.
ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులతో ఆగడు జనాల్ని అలరించడానికి మరి కొన్ని గంటల్లో వచ్చేస్తోంది. హైదరాబాద్ మరి కొన్ని పట్టణాల్లో తెల్లవారు ఝామున నాలుగు గంటలకే బెనిఫిట్ షొలు వేస్తున్నారు. రెండువేల రూపాయిల టికెట్ కావడం విశెషం.