ఓ నటికి సంబంధించి రెండు సినిమాలు ఒకేసారి రెడీ అయితే కాస్త కష్టమే. ముఖ్యంగా ప్రమోషన్ కు టైమ్ కేటాయించడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇదే సమస్య ఓ నటికి ఎదురవుతోందట.
Advertisement
దాంతో ఒక సినిమా నిర్మాత పైకి ఏమీ అనలేక, అడగలేక కిందా మీదా అవుతున్నారట. అదే నటి సినిమా మరోదానికి ప్రచారం మారుమోగుతుంటే, తన సినిమా ప్రచారానికి ఆ నటికి టైమ్ సరిపోకపోవడం, సదరు నిర్మాతను బాధ పెడుతోందట.
గట్టిగా అడిగితే కోపం వస్తుందేమో అన్న భయం. అడగకుండా ఊరుకుంటే, సినిమాకు ఓపెనింగ్స్ రావేమో అన్న దిగులు..ఇలా రెండింటి మధ్య సతమతమవుతున్నాడట సదరు నిర్మాత.