ఎవరైనా దిగివస్తారేమో కానీ, మడమ తిప్పడు, మాట మార్చడు జూనియర్ ఎన్టీఆర్ అని అనుకోవాల్సి వస్తోంది. ఎందుకలా? అని అడిగితే రెండు సంఘటనలు చెప్పుకోవాల్సి వస్తోంది. కొద్ది రోజుల క్రితం లోకేష్ బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. నందమూరి ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్లింది. ఇటీవల లోకేష్ తో, బాలయ్యతో ఎడమొహంగా వుంటున్నారని వార్తలు వినవచ్చినా… హరికృష్ణ కూడా వెళ్లారు. ఆయనతో పాటు కొడుకు కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. బాలయ్య బాబాయ్ యధాలాపంగా షేక్ హ్యాండ్ ఇచ్చినా, తాను మాత్రం ముందుకెళ్లి మరీ చేయి కలిపారు కళ్యాణ్ రామ్.
నిజానికి బాబు ఫ్యామిలీతో, బాలయ్య ఫ్యామిలీతో మళ్లీ టచ్ లోకి వెళ్లాలంటే, ఎన్టీఆర్ ఈ అకేషన్ ను అద్భుతంగా వాడుకుని వుండొచ్చు. పైగా అలా వెళ్తే, అక్కడ ఆ రోజు ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారు. కానీ వెళ్లలేదు. ఖాళీలేక, షూటింగ్ ఇలాంటివి ఎన్నయినా చెప్పొచ్చు. హీరో ఇంటి ఫంక్షన్ వుందంటే నిర్మాత కాదనడు. అయినా ఆ సినిమాకు నిర్మాత ఎవరు కళ్యాణ్ రామ్ నే గా. ఆయనే వెళ్లాడు మరి.
సరే, ఇక రెండో అకేషన్. జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ ను వేలం వేసారు. ఆ డబ్బును నందమూరి బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇస్తాం అన్నారు నిర్మాతలు. ఆనందంగా అపాయింట్ మెంట్ ఇచ్చాడు బాలయ్య. పదిలక్షల చెక్ ను నిర్మాతలు, నవీన్, రవిశంకర్, దర్శకుడు కొరటాల శివ అందించారు. దీనికీ వెళ్లలేదు ఎన్టీఆర్. నిర్మాతలు రమ్మన్నారని, ఎన్టీఆర్ ఖాళీ లేదని చెప్పారని టాక్. అంటే ఈ అవకాశాన్ని కూడా వదులుకున్నారు ఎన్టీఆర్.
అంటే అసలైన నందమూరి వాడనుకోవాలి. మాట మార్చడు, మడమతిప్పడు. అచ్చమైన సీతయ్య మన ఎన్టీఆర్.