Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అది ఎన్టీఆర్ 'సూపర్ మచ్చి' అంట

అది ఎన్టీఆర్ 'సూపర్ మచ్చి' అంట

త్రివిక్రమ్ సినిమాల్లో పాటలు క్యాచీగా వుంటాయి. పాపులర్ గా వుంటాయి. కానీ పక్కా సీ సెంటర్ మాస్ బీట్లు తక్కువ. బన్నీ చేసిన 'సూపర్ మచ్చి' సాంగ్ అలాంటిది. మళ్లీ అలాంటి పాట త్రివిక్రమ్ సినిమాల్లో లేదు. కానీ ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఆ లోటు తీర్చేయబోతున్నారట.

అటు తివిక్రమ్ సినిమాల్లో రెండోది, ఇటు ఎన్టీఆర్ కు ఫస్ట్ అన్నంత మాస్ బీట్ గా అరవిందలో ఓ పాట వుంటుందట. 'రెడ్డిగారు' అంటూ స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ కోసం థమన్ సూపర్ మాస్ ట్యూన్ ఇవ్వడం, త్రివిక్రమ్ దానికి మరింత సానబట్టడం జరిగినట్లు తెలుస్తోంది.

ఈపాట ఈరోజు సాయంత్రం ఆన్ లైన్ లోకి వస్తుంది. ఈ రోజు అరవింద ఆల్బమ్ లోని టోటల్ సాంగ్స్ ఆన్ లైన్ లోకి వదుల్తున్నారు. మొత్తం నాలుగు పాటలు వుంటాయన్న సంగతి తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి, సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యానికి థమన్ సంగీతం అందించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?