ఇంత ఘోరంగా ఉంటుందా అఖిల్!

సినిమాల్లోకి రాకముందే బాగుండేది. నాగార్జున చిన్న కొడుకుగా, మంచి క్రికెటర్ గా, అందగాడిగా అఖిల్ కు భలే క్రేజ్ ఉండేది. అదే క్రేజ్ తో మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే యాడ్ కూడా చేశాడు…

సినిమాల్లోకి రాకముందే బాగుండేది. నాగార్జున చిన్న కొడుకుగా, మంచి క్రికెటర్ గా, అందగాడిగా అఖిల్ కు భలే క్రేజ్ ఉండేది. అదే క్రేజ్ తో మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే యాడ్ కూడా చేశాడు ఈ చిచ్చరపిడుగు. ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చాడో, వరుసగా ఫ్లాపులు తెచ్చుకుంటున్నాడో అప్పట్నుంచి అఖిల్ క్రేజ్ తగ్గడం ప్రారంభమైంది. ఆ పాపులారిటీ ఎంత తగ్గిందో చెప్పడానికి రీసెంట్ గా జరిగిన ఓ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

అవసరాల శ్రీనివాస్ హీరోగా ఎన్నారై అనే సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు క్లాప్ కొట్టడానికి అక్కినేని అమలను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఖాళీగా ఉన్నాడని అఖిల్ ను కూడా తీసుకెళ్లింది అమల. సరిగ్గా ఇక్కడే వ్యవహారం తేడాకొట్టింది. అమల క్లాప్ కొట్టడం మాట అటుంచి, అఖిల్ కు తలకొట్టేసినట్టయింది.

ఎన్నారై మూవీ ఓపెనింగ్ కు నాగబాబు, నాని, మంచులక్ష్మి ఇలా కొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ హడావుడిలో అఖిల్ ను ఎవరూ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా నాని వచ్చిన తర్వాత అఖిల్ పూర్తిగా పక్కకెళ్లిపోయాడు. కెమెరాలన్నీ నానిపైనే పడ్డాయి. అక్కడున్న జనాలంతా నాని చూట్టూరా చేరారు. దీంతో అఖిల్ కాస్త నవ్వుకుంటూనే వెనక్కి వెళ్లిపోయాడు.

ఈ సీన్ లో అక్కడున్న చాలామంది మీడియా మిత్రులు అఖిల్ పరిస్థితి చూసి కాస్త నొచ్చుకున్నారు. కనీసం ఒక్క హిట్ ఉన్నా ఇప్పుడిలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. పేరుకు పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సక్సెస్ లేకపోతే ఇలానే ఉంటుంది మరి.

అఖిల్ తనకు జరిగింది అవమానంగా ఫీల్ అయ్యాడో లేదో కానీ అక్కడున్న మిగతా జనాలు మాత్రం అఖిల్ కు చాలా పెద్ద అవమానం జరిగిందంటూ గుసగుసలాడుకున్నారు.

ఎన్నారై సినిమా లాంఛ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

రాయలసీమ రైతుల పుండుపై కారం