మళ్లీ ఇదంతా అవసరమా నాని!

ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా బ్యానర్ పెట్టాడు. అంతే రహస్యంగా ఓ సినిమా కూడా తీశాడు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులు మాత్రమే చేస్తానని గొప్పగా ప్రకటించి 'అ!' సినిమా నిర్మించాడు. ప్రయత్నం…

ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా బ్యానర్ పెట్టాడు. అంతే రహస్యంగా ఓ సినిమా కూడా తీశాడు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులు మాత్రమే చేస్తానని గొప్పగా ప్రకటించి 'అ!' సినిమా నిర్మించాడు. ప్రయత్నం బాగుంది కానీ నిర్మాతగా నాని ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. అలా ప్రొడక్షన్ కు దూరమైన నాని ఇప్పుడు మరోసారి ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో, నిర్మాతగా కూడా మరోసారి సినిమాలు నిర్మించాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా రెండు వెంచర్స్ పై దృష్టిపెట్టాడు. వీటిలో ఒకటి ఇంద్రగంటి-దిల్ రాజు సినిమా. వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తిచేశాడు ఇంద్రగంటి.

కానీ ఆ సబ్జెక్టు మల్టీస్టారర్ కావడం, భారీ బడ్జెట్ మూవీ అవ్వడంతో దిల్ రాజు వెనక్కితగ్గాడు. కానీ కథపై నానికి మంచి గురి కుదిరింది. అందుకే దిల్ రాజుకు సపోర్ట్ గా సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. అవును.. దిల్ రాజు, నాని నిర్మాతలుగా ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఒక హీరో నాని, మరో హీరో ఎవరనేది త్వరలోనే తేలుస్తారు.

ఇక నాని ప్రొడ్యూస్ చేయబోతున్న మరో ప్రాజెక్టు ఓ చిన్న సినిమా. సందీప్ రాజ్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ ప్రయోగాత్మక చిత్రం నిర్మించబోతున్నాడు నాని. అ! సినిమా టైపులోనే ఇది చాలా కొత్తగా ఉండబోతోందట. ఇలా హీరోగా కొనసాగుతూనే, నిర్మాతగా కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నాని.

రాయలసీమ రైతుల పుండుపై కారం