Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాల‌య్య అంత పెద్ద బాధ్యత అప్పజెప్పాడా?

బాల‌య్య అంత పెద్ద బాధ్యత అప్పజెప్పాడా?

బోయ‌పాటి శ్రీనుకీ, బాల‌కృష్ణకీ గురి బాగా కుదిరింది. నంద‌మూరి అభిమానులు త‌మ క‌థానాయ‌కుల సినిమాల నుంచి ఏం ఆశిస్తారో బోయ‌పాటి శ్రీను బాగా క‌నిపెట్టారు. అందుకే ఆయ‌న నుంచి `సింహా`, `లెజెండ్‌`లాంటి సినిమాలు వ‌చ్చాయి. ఈ చిత్రాలు బాల‌య్య కెరీర్‌కి చేసిన మేలు అంతా ఇంతా కాదు. 

హిట్టు లేక ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలోనే... బోయ‌పాటి ఆప‌ద్భాంధ‌వుడిలా ఎంట‌ర్ అయ్యి బాల‌కృష్ణకి భారీ విజ‌యాన్ని అందిస్తున్నాడు. అందుకే ఆయ‌నకి త‌న వందో చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవ‌కాశం క‌ల్పించాడు బాల‌య్య‌. `లెజెండ్‌` బాల‌కృష్ణకి 98వ చిత్రం. 99వ చిత్రానికి ఓ కొత్త ద‌ర్శకుడు తెర‌కెక్కించ‌బోతున్నాడు.

వందో చిత్రాన్ని మాత్రం బోయ‌పాటి చేతుల్లో పెట్టాడ‌ట‌. దీన్ని పీవీపీ ప‌తాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించ‌బోతున్నార‌ని స‌మాచారం.  వ‌చ్చే యేడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?