అల్లరి నరేష్-ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లోని బందిపోటు విడుదలయింది. మిక్స్ డ్ టాక్ స్వంతం చేసుకుంది. ఇంద్రగంటి అభిమానులు ఆయన స్టయిల్ లో వుంది అనుకుంటే, నరేష్ అభిమానులు అతగాడి స్టయిల్ లో లేదు అంటున్నారు.
ఈ సంగతి అలా వుంటే సెకండాఫ్ లో వున్న రాజకీయాలు, ప్రసంగాలు, ప్రచారం హోరు వంటి వ్వవహారాల్లో ఓ నాలుగైదు నిమషాలకు కత్తెరవేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సల్ గా వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టి లో పెట్టుకుని, సెకండాఫ్ లోని ఈ ఎపిసోడ్ లో నాలుగైదు నిమషాలు తగ్గిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి యూనిట్ వచ్చినట్లు బోగట్టా.
ప్రేక్షకాభిప్రాయాన్ని మన్నించడం మంచిదేగా?