బెంగాల్ టైగర్..హీరో రవితేజ అప్ కమింగ్ మూవీ. సంపత్ నంది దర్ళకుడు. దీపావళికి విడుదల సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ మీద ఇటీవల డిజాస్టర్ అయిన కిక్ 2 సినిమా ప్రభావం చూపిస్తోందని వినికిడి.
సంపత్ నంది-రవితేజ-సినిమా టైటిల్-తమన్నా లాంటి ప్లస్ పాయింట్లు వున్నా, కిక్ 2 తో రవితేజ మార్కెట్ దారుణంగా పడిపోయిందని, బయ్యర్లు కొనుగోలు రేట్ల విషయంలో బేరాలు ఆడుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల నిర్మాత రాధామోహన్ కు ఓ మూడు కోట్లయినా ఆదాయం తగ్గిపోతుందని టాక్.
పైగా కిక్ 2 లో రవితేజ లుక్ కూడా చాలా మైనస్ అయింది. సంపత్ నంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బెంగాల్ టైగర్ లో కూడా లుక్ అంతగా మారుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇవన్నీ చూసి బయ్యర్లు, సినిమా సంగతి ఎలా వున్నా, ఇదే అవకాశం అని బేరాలు ఆడుతున్నారని టాలీవుడ్ సర్కిళ్ల బోగట్టా.