బన్నీ మీద మీడియాకు కోపం వచ్చింది..ఇక్కడ ఎవరిది తప్పు అన్నది పక్కన పెడితే, ట్విట్టర్ తెచ్చిన తంటా ఇది. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి విడుదల మరో రెండు రోజుల్లో వుంది. దీని ప్రమోషన్ కోసం ప్రింట్ మీడియాకు పేరంటం మాదిరిగా ఈరోజు పొద్దున్న ఇంటర్వ్యూల కార్యక్రమం పెట్టారు. టైమ్ సరిపోతుంది అనుకున్నాడు బన్నీ.
ఎందుకంటే, రేపు బన్నీ ట్విట్టర్ ప్రవేశ కార్యక్రమం. మరి అది ఇలా అలా, సాదా సీదాగా వుంటుందా..దానికోసం ఏదో షూటింగ్ పెట్టుకున్నారు. దానికో డ్యాన్స్ మాస్టర్. అతగాడు వదలడు..ఇతగాడు కదలడు..అక్కడ మీడియా వెయిటింగ్..ఇదిగో వస్తా..అదిగో వస్తా..
అయితే మీడియా మాట వేరుగా వుంది. బన్నీని కలిసేందుకు కొందరు ఫ్రెండ్స్ వచ్చారని, వారితో బాతాఖానీ కొడుతూ మీడియాను వెయింటింగ్ లో వుంచాడనీ. బన్నీ పర్సనల్ పీఆర్వో ఎంత చేయాలో అంతా చేసాడు..మీడియాను మేనేజ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆఖరికి సహనం చచ్చిన మీడియా బాయ్ కాట్…అంది.
అయినా ముందుగా టైమ్ చూసుకోవద్దా..టైమ్ బాగున్నపుడు మీడియాను వెయిటింగ్ లో పెట్టి, ఫ్లాపులొచ్చాక వినయం చూపిస్తే కుదురుతుందా?