చైతూ సరసన మరోసారి పూజ

నాగ చైతన్య సరసన క్లాస్ లవ్ జోనర్ లో నటించి, ఆపై – డిజె సినిమాతో తనలోని అందాలేంటో భళ్లున ఒంపేసి, ఒకేసారి చూపించేసింది పూజా హెగ్డే. దాంతో ఇప్పుడు సినిమా జనాలు అందరూ…

నాగ చైతన్య సరసన క్లాస్ లవ్ జోనర్ లో నటించి, ఆపై – డిజె సినిమాతో తనలోని అందాలేంటో భళ్లున ఒంపేసి, ఒకేసారి చూపించేసింది పూజా హెగ్డే. దాంతో ఇప్పుడు సినిమా జనాలు అందరూ ఆమె వైపు తిరిగారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా ఓకే చేసిన పూజా ఇప్పుడు మరోసారి నాగ్ చైతన్య సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తయారు కాబోయే సినిమాకు పూజాహెగ్డే ఫైనల్ ఆప్షన్ గా మిగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెనే ఫైనల్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆగస్టులో పూజ చేసి, సెప్టెంబర్ 11 నుంచి షూట్ కు వెళ్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తారు. 

ఇదిలా వుంటే నాగ చైతన్యతో సినిమా స్టార్ట్ చేయాలని హారిక హాసిని సిస్టర్ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూడా ట్రయ్ చేస్తోంది. సౌజన్య అనే కొత్త దర్శకురాలి కథ ఒకే అయింది కానీ మళ్లీ పక్కన పెట్టారు. మరో మీడియం రేంజ్ డైరక్టర్ తో సెట్ చేయడానికి చూస్తున్నారు. కానీ నాగ చైతన్య ఇంకా ఎస్ ఆర్ నో చెప్పడంలేదు.