అక్టోబర్ నుంచి ఫుల్ టైమ్ రాజకీయాలే అని ప్రకటించేసారు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యంకాదేమో అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం నటిస్తున్న త్రివిక్రమ్ డైరక్షన్ సినిమానే ఇంకా చాలా షూటింగ్ వుందట. అది అక్టోబర్ చివరకు కానీ పూర్తి కాదంటున్నారు. పైగా ఆ సినిమాను చాలా లీజర్ గా తీస్తున్నారట. మధ్యాహ్నం పన్నెండుకు స్టార్ట్ చేసి, సాయంత్రం అయిదుకు పేకప్ అంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా పూర్తిగా అన్ని పనులు ఫినిష్ అయ్యి విడుదలకు సిద్దం కావాలంటే డిసెంబర్ ఆఖరుకే అన్నది ఇండస్ట్రీ న్యూస్.
పైగా ఈ సినిమాకు ఊ అంటే గ్రీన్ మ్యాట్. ఆ అంటే గ్రీన్ మ్యాట్ వేస్తున్నారట. మామూలుగా తీయాల్సిన కొన్నిసీన్లు కూడా పవన్ మనసెరిగి, గ్రీన్ మ్యాట్ సీన్లుగా మారుస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రాజెక్టు మరింత ఆలస్యం, మరింత వ్యయం అవుతోందని టాక్ వినిపిస్తోంది.
ఇక మైత్రీ మూవీస్ దగ్గర భారీ పారితోషికం తీసుకుని, సంతోష్ శ్రీనివాస్ ను డైరక్టర్ గా అప్పగించింది పవన్ నే. మరి ఆ సినిమా స్టార్ట్ చేసి, ఫినిష్ చేయాల్సి వుంది. మరి అదెప్పుడు చేస్తారో? ఎంతకాదన్నా వచ్చే జూన్ కు కానీ అది ఫినిష్ కాదు. అది కూడా చకచకా చేస్తే, లేదూ అంటే వచ్చే ఏడాది దసరాకే. అంటే పవన్ చెప్పిన అక్టోబర్ 2018 అక్టోబర్ నా అన్నది అనుమానం.