సాధారణంగా ట్రాక్ రికార్డు బాగున్న హీరోయిన్ ను సినిమాలోకి తీసుకోవాలనుకుంటారు. కానీ రామ్ చరణ్-శ్రీనువైట్ల ఇందకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఓ హీరోయిన్ గా ఫిక్సయిపోయింది.
మరో కీలక పాత్ర కూడా వుందట. దానికి ఇప్పుడు కృతి కర్బందాను తీసుకోవాలని అనుకుంటున్నారని బోగట్టా. కృతి ఎవరో కాదు..బోణీ, ఓం, ఒంగోలు గిత్త అనే మూడు ఫ్లాప్ సినిమాల్లో హీరోయిన్. మరి ఈ అమ్మడి మీద ఎలా పడిందో శ్రీను వైట్ల-రామ్ చరణ్ కన్ను? కొద్ది రోజుల్లో ఇది కన్ఫర్మ్ అవుతుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా.