తుఫాన్ ఫలితంతో జాగ్రత్త పడుతున్నాడు రామ్‌చరణ్. ఇక మీదట కథ విషయంలో ఎలాంటి ప్రయోగాలూ చేయకూడదే గట్టి నిర్ణయానికి వచ్చేశాడు. అంతేకాదు.. వరుసగా సినిమాలు చేతిలో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. అందుకే కొత్త కథలు వింటున్నాడు.
కృష్ణవంశీ కథకు ఓకే చెప్పిన చరణ్.. ఇప్పుడు కిక్ సురేందర్ రెడ్డినీ వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టాడట. అతనొక్కడే, కిక్ సినిమాలతో తెలుగు పరిశ్రమను ఆకట్టుకొన్నాడు సురేందర్‌రెడ్డి. ఇప్పుడు బన్నీని రేసుగుర్రం ఎక్కించాడు. బన్నీ రికమెండేషన్ వల్లే.. చరణ్‌కి ఓ కథ చెప్పాడట సురేందర్.
అది చరణ్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. కృష్ణవంశీ సినిమా తరవాత నీకే ఛాన్స్ ఇస్తా అన్నాడట. దాంతో.. చరణ్ ఖాతాలో మరో సినిమా చేరినట్టైంది. ఈ కాంబినేషన్ గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.