వారెవ్వా ప్రభాసా..?

మహేష్‌బాబు తరవాత లేడీ ఫాలోయింగ్‌ ఆ రేంజులో ఉన్న కథానాయకుడు ప్రభాస్‌. అతని స్టైల్‌, ట్రెండ్‌ లుక్స్‌ అంత బాగా ఆకట్టుకొంటాయి. పైగా బ్రహ్మాచారి కదా..?  అమ్మాయిల చూపులన్నీ ఈ బాహుబలిపైనే.  Advertisement ప్రభాస్‌కి…

మహేష్‌బాబు తరవాత లేడీ ఫాలోయింగ్‌ ఆ రేంజులో ఉన్న కథానాయకుడు ప్రభాస్‌. అతని స్టైల్‌, ట్రెండ్‌ లుక్స్‌ అంత బాగా ఆకట్టుకొంటాయి. పైగా బ్రహ్మాచారి కదా..?  అమ్మాయిల చూపులన్నీ ఈ బాహుబలిపైనే. 

ప్రభాస్‌కి యువతరంలో ఉన్న ఫాలోయింగ్‌ మరోసారి సినీ ప్రపంచానికి అర్థమైంది. ప్రభాస్‌ ఫేస్‌ బుక్‌ లైక్స్‌ ఈ విషయాన్ని చాటిచెప్పాయి. రెండు రోజుల క్రితమే ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే ఏకంగా వేలకు వేలు లైక్స్‌ చేరిపోయాయి. వాటిలో అమ్మాయిల వాటానే ఎక్కవు. 

ప్రభాస్‌ ట్రెండీ లుక్స్‌ కి, కండలు తిరిగిన దేహానికి ఫ్లాటైపోతున్నారు అమ్మాయిలు. అందుకే ప్రభాస్‌ కి ఇంత క్రేజ్‌ వచ్చేసింది. ఇక నుంచి ఫేస్‌బుక్‌లో నిత్యం టచ్‌లో ఉంటా… అని ప్రభాస్‌ మాట కూడా ఇచ్చాడట. ఇక అభిమానులకు కబుర్లే.. కబుర్లు.