సుకుమార్‌తో ఎన్టీఆర్‌??

నిన్నా మొన్నటి వరకూ త్రివిక్రమ్‌ పేరు జపం చేసిన ఎన్టీఆర్‌.. ఇప్పుడు రూటు మార్చాడు. తన దగ్గరకు వస్తున్న కొత్త కథలు వింటున్నాడు. దర్శకుడు ఎవరైనా ఫర్లేదు, కథలో దమ్ముంటే చాలు… అనే స్థితికి…

నిన్నా మొన్నటి వరకూ త్రివిక్రమ్‌ పేరు జపం చేసిన ఎన్టీఆర్‌.. ఇప్పుడు రూటు మార్చాడు. తన దగ్గరకు వస్తున్న కొత్త కథలు వింటున్నాడు. దర్శకుడు ఎవరైనా ఫర్లేదు, కథలో దమ్ముంటే చాలు… అనే స్థితికి వచ్చాడు. 

ఇప్పుడు  సుకుమార్‌తో జట్టు కడితే ఎలా ఉంటుంది??  అని ఆలోచిస్తున్నట్టు సమాచారమ్‌. సుక్కు కూడా ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకొంటున్నాడు. ప్రస్తుతం మహేష్‌తో '1' సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్‌. ఆ సినిమా పూర్తయ్యాకే ఈ కొత్త సినిమా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.

అత్తారింటికి దారేది సినిమాతో నాలుగు డబ్బులు వెనకేసుకొన్న నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. కొరటాల శివ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.