చార్జ్ మొత్తం లాగేసిన అఖిల్

అఖిల్ సినిమా హీరో అఖిల్ చార్జింగ్ మొత్తాన్ని లాగేసిందట. ఈ విషయాన్ని అఖిల్ నే స్వయంగా చెప్పేసాడు. ఆటాడుకుందాం రా అడియో ఫంక్షన్ లో అఖిల్ మాట్లాడుతూ అఖిల్ సినిమా చార్జింగ్ మొత్తం డౌన్…

అఖిల్ సినిమా హీరో అఖిల్ చార్జింగ్ మొత్తాన్ని లాగేసిందట. ఈ విషయాన్ని అఖిల్ నే స్వయంగా చెప్పేసాడు. ఆటాడుకుందాం రా అడియో ఫంక్షన్ లో అఖిల్ మాట్లాడుతూ అఖిల్ సినిమా చార్జింగ్ మొత్తం డౌన్ అయిపోయిందని, ఇప్పుడే మళ్లీ ఫుల్ చార్జ్ లోకి వచ్చానని, త్వరలో సినిమా మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. 

అఖిల్ సినిమా తరువాత మళ్లీ అంత కాన్ఫిడెన్స్ తో అఖిల్ కనిపించడం ఈ ఫంక్షన్ లోనే. కొద్ది నిమిషాలే అయినా చాలా కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు. పనిలో పనిగా నాగ్ గురించి చిన్న ముచ్చట చెప్పాడు. అమితాబ్, నాగ్ కలిసి కళ్యాణ్ జ్యూయలర్స్ కోసం ఏడ్స్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరో ఏడ్ షూట్ చేస్తున్నారట. దాన్ని నిన్న ముంబాయిలో షూట్ చేసారట. 

నాగ్ ఇప్పుడు డిఫరెంట్ గెటప్ లో వున్నాడు. జుత్తు, గెడ్డం పెరిగి. కానీ కళ్యాణ్ జ్యూయలర్స్ ఏడ్ ను ఈ గెటప్ కు అనుగుణంగా ఎలా తయారుచేసారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే చాలు టీవీల్లోకి వచ్చేస్తుంది.  అఖిల్ మాట్లాడిన ఫంక్షన్ కు కారణమైన ఆటాడుకుందాం రా వచ్చేవారం విడుదలయ్యే అవకాశం వుంది.