చిరంజీవి చేయించిన మిస్టేక్‌!

ధృవ, రంగస్థలంతో గాడిన పడ్డాడని అనిపించుకున్న రామ్‌ చరణ్‌తో మళ్లీ సైడ్‌ ట్రాక్‌ పట్టించింది 'వినయ విధేయరామ'. ఏవైతే సినిమాలు తనకి కలిసి రావడం లేదని, కొత్త ఆలోచనలని ప్రోత్సహించడం మొదలు పెట్టాడో మళ్లీ…

ధృవ, రంగస్థలంతో గాడిన పడ్డాడని అనిపించుకున్న రామ్‌ చరణ్‌తో మళ్లీ సైడ్‌ ట్రాక్‌ పట్టించింది 'వినయ విధేయరామ'. ఏవైతే సినిమాలు తనకి కలిసి రావడం లేదని, కొత్త ఆలోచనలని ప్రోత్సహించడం మొదలు పెట్టాడో మళ్లీ అలాంటి చిత్రమే చేయడం అభిమానులకి సయితం షాకిచ్చింది. బోయపాటి శ్రీను నుంచి వెరైటీ సినిమా ఆశించకపోయినా కానీ కనీసం ఓ సెన్సిబుల్‌ చిత్రాన్ని అయితే ఎక్స్‌పెక్ట్‌ చేసారు.

కానీ బోయపాటి శ్రీను పూర్తిగా మాస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయి చరణ్‌ నుంచి ఈ టైమ్‌లో రాకూడని సినిమా ఇచ్చాడు. అసలు ధృవ, రంగస్థలం అంటూ వెళుతోన్న చరణ్‌ ఎందుకని బోయపాటి శ్రీనుతో చేసినట్టు? రంగస్థలం విడుదల కాకముందే ఓకే అయిన ప్రాజెక్ట్‌ ఇది.

రంగస్థలం రిస్క్‌తో కూడుకున్నది కనుక అది కానీ మిస్‌ఫైర్‌ అయితే సేఫ్‌ సైడ్‌కి బోయపాటి సినిమా చేయాలని చిరంజీవి సజెషన్‌పై చరణ్‌ ఈ ప్రాజెక్ట్‌ ఓకే చేసాడు. అయితే రంగస్థలం అనూహ్య విజయం సాధించడమే కాకుండా చరణ్‌కి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.

దానికి ఫాలో అప్‌గా మరో వెరైటీ కమర్షియల్‌ చిత్రం చేసినట్టయితే బాగుండేది కానీ బోయపాటికి వేరే ఆలోచనలున్నాయి. రామ్‌ చరణ్‌ని రాంబోలా చూపించడానికి అతను చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మూడున్నర మిలియన్‌ డాలర్లు సాధించిన యుఎస్‌లో అర మిలియన్‌ అయినా వస్తుందా అనేంత బ్యాడ్‌ టాక్‌తో మొదలయింది. 

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?