నాగబాబు అవగాహన లేని మాటలు!

కనీసం ఎమ్మెల్సీ అయిన తర్వాత అయినా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణ స్వరూపాన్ని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది.

నిన్నటి దాకా కొణిదెల నాగబాబు ఒక సాధారణమైన సినీ నటుడు. తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో ఆయనకు ఏదైనా పదవులు ఉంటే ఉండవచ్చు గాని, అవి పరిగణించదగినవి కాదు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తి. నిన్నటిదాకా ఆయన యూట్యూబ్లో ఎలాంటి మాటలు, అభిప్రాయాలు పెట్టినా అందులో లోపాలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ్టి పరిస్థితి అది కాదు.

నాగబాబు ఒక చట్టసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఆయనకు ఎమ్మెల్సీగా స్థానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పొల్లు మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ తనకు తెలియని విషయాలు చెప్పవలసి వస్తే ముందుగా ఎవరినైనా అడిగి తెలుసుకుని మాట్లాడాలి. కానీ తమ పార్టీ ఆవిర్భావ సమావేశంలో అత్యుత్సాహ ప్రసంగం చేసిన నాగబాబు అవగాహన లేని మాటలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.

ఆయన రకరకాల విషయాలు ప్రస్తావిస్తూ మధ్యలో ‘రాష్ట్రంలో ప్రతిపక్షం..’ అంటూ ఏదో చెప్పబోయి, అంతలోనే తన మాటలను తానే సర్దుకుని, ‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కదా’ అని సెలవిచ్చారు! ఇది కేవలం రాజకీయ అవగాహన లోపం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం పట్ల ఆయనకు కనీస సంగతులు కూడా తెలియక పోవడం వల్ల.. ఇలా మాట్లాడుతున్నారని జనాభిప్రాయంగా ఉంది. ఎందుకంటే శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలనే డిమాండ్ తో జగన్మోహన్ రెడ్డి పోరాటం సాగిస్తున్నంతమాత్రాన, ప్రతిపక్షం లేదు అనేది దాని అర్థం కాదు అని నాగబాబు తెలుసుకోవాలి.

శాసనసభలో పాలక పక్షంలో లేని పార్టీలన్నీ కూడా ప్రతిపక్షాలే. ప్రస్తుత శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాకుండా, ఏ సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలకు కనీసం ఒక్క సీటు ఉండి ఉంటే వారిని కూడా ప్రతిపక్షంగా గుర్తించాల్సిందే. అయితే జగన్ అడుగుతున్న హోదా అనేది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా మాత్రమే! కాకపోతే.. ప్రస్తుతం అసెంబ్లీలో పాలక కూటమికి వ్యతిరేకంగా ఒక్క పార్టీ మాత్రమే ఉన్నది గనుక.. ఆయన ప్రధాన అనే పదం వాడకుండా ప్రతిపక్షనేత హోదా అని అడుగుతున్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనేది 10 శాతం సీట్లు పొందిన ప్రతిపక్షాలలో అత్యధిక సీట్లు ఉన్న వారికి మాత్రమే దక్కుతుంది అనేది ఒక సాంప్రదాయం. ఉదాహరణకు 175 సీట్ల ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో పాలక కూటమి 134 సీట్లకు పరిమితమై.. వైయస్సార్ కాంగ్రెస్కు 21 సిపిఐ కి 20 సీట్లు వచ్చాయని అనుకుందాం. అప్పుడు ఆ రెండు పార్టీలు కూడా తప్పకుండా ప్రతిపక్షాలు అవుతాయి. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత గా క్యాబినెట్ సమాన ర్యాంకు హోదా మాత్రం ఈ ఇద్దరిలో ఎక్కువ సంఖ్యలో సీట్ల బలం ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ అధినేతకు దక్కుతుంది. ఇదంతా సాంకేతిక పరమైన సంగతి.

ఈ విషయాలపై కనీస అవగాహన కూడా లేకుండా రాష్ట్రంలో ప్రతిపక్షం లేనేలేదు కదా అని వెటకారంగా నాగబాబు మాట్లాడడం ఆయనలోని అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతుంది. కనీసం ఎమ్మెల్సీ అయిన తర్వాత అయినా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణ స్వరూపాన్ని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది.

14 Replies to “నాగబాబు అవగాహన లేని మాటలు!”

  1. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా “పెళ్ళాం పార్టీ”ని పండబెట్టి దె0గిన, అప్రియమైన శ్రీవారికి, మొగుడి పార్టీ 11 వ పుట్టినరోజు శుభాకాంక్షలు

    ఇట్లు

    నీ నాలుగో భార్య Leven మోహిని

  2. “ఘరానా మొగుడికి కోడికత్తి పెళ్ళాం” శుభాకాంక్షలు

    సిద్ధమా?? Why Not 175.. అంటూ అహంకారం తో విర్రవీగిన తన “A1పెళ్ళాన్ని నేలమీద పండబెట్టిన” “ఘరానా మొగుడు “కి 11 వ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు.

  3. జెగ్గు తెలుగు దేశానికి 23 లో ఒక 5 గురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదు అని సెలవు ఇచ్చాడు అసెంబ్లీ సాక్షిగా 5 ఏళ్లుగా…. అప్పుడు ఏమి అయింది ఈ జ్ఞానం… నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా….

  4. అంటే ja*** గాడు హాస్య నటుడు అన్న మాట మీద నీకు అభ్యంతరం లేదు అది నిజమే అంటావ్!!

    నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా కోసం కాదు ప్రజలు తరపున ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి!! వీడు నిజంగానే ఐటెమ్ నెంబరే!!

  5. జనసేన పార్టీ లో NO.2 గా ఉన్న నాదెండ్ల మనోహర్ స్థానాన్ని నాగబాబు ఆక్రమించడం, తరువాత నాదెండ్ల మనోహర్ అవమానం తో బయటికి జనసేన నుంచి వెళ్లిపోవడం, నాగబాబు జనసేన ను సంకనాకించేయడం, ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ కి అర్ధం కాకపోవడం… జనసేన ను ఒక జాతీయ పార్టీ లో విలీనం చేయడం… ఈ నాలుగేళ్లలో చక చకా జరిగిపోతాయి…

Comments are closed.