Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అసలు విషయం ఏంటో చెప్పు బోయపాటి?

అసలు విషయం ఏంటో చెప్పు బోయపాటి?

డైరక్షన్ చేస్తున్నప్పుడు హీరోలకు ఎలాగైతే క్యారెక్టర్ కు సంబంధించి బోలెడన్ని విషయాలు చెబుతుంటాడో.. ప్రెస్ మీట్లో కూడా మీడియా ముందు అలానే చాలా కబుర్లు వినిపిస్తుంటాడు బోయపాటి. ఏ విషయంపైనైనా అనర్గలంగా మాట్లాడతాడే తప్ప అసలు విషయం మాత్రం చెప్పడు. తన అప్ కమింగ్ మూవీపై పై కూడా ఇలానే రియాక్ట్ అయ్యాడు ఈ దర్శకుడు.

చిరంజీవి గారితో కచ్చితంగా సినిమా ఉంటుందండి.. మహేష్ బాబు ఎప్పుడు రెడీ అంటే నేను అప్పుడు రెడీ.. బాలయ్య బాబుతో గ్యారెంటీగా ఓ సినిమా చేస్తా.. అఖిల్ తో ఓ సినిమా ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది.. తన అప్ కమింగ్ మూవీ గురించి చెప్పమంటే బోయపాటి చెబుతున్న డైలాగ్స్ ఇవి.

ఇప్పుడు ఏదో కొత్తగా బోయపాటి చెబుతున్న మాటలు కావివి. సరైనోడు సినిమా నుంచి సేమ్ డైలాగ్స్. అందరి పేర్లు చెబుతాడు, ఇంకేదో సినిమా ప్రకటిస్తాడు. వినయ విధేయరామ కూడా అలా లిస్ట్ లో లేకుండా వచ్చినదే. ఇప్పుడు కూడా సేమ్ డైలాగ్స్ అలా ఆసువుగా రిపీట్ చేశాడంతే.

సో.. బోయపాటి నెక్ట్స్ సినిమా ఏంటనేది ఎవరూ గెస్ చేయలేరు. దీనికితోడు వినయ విధేయరామ ఫ్లాప్ అవ్వడం ఇతడి ఆప్షన్లను మరింత తగ్గించేసింది.

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?